మామూలుగా సాయంకాలం వేళ పిల్లలు, పెద్దలు స్నాక్ ఐటమ్స్ గా వడలు వంటి ఐటమ్స్ తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. అందులో భాగంగానే ఎన్నో రకాల వడలను తింటూ ఉంటాం. మిరపకాయ వడలు, బంగాళదుంప వడలు, అలసంద వడలు, శనగపిండి వడలు, కోడిగుడ్డు వడలు అంటూ రకరకాల పదార్థాలతో తయారుచేసిన వడలను తినే ఉంటాం. కానీ ఎప్పుడైనా వెరైటీగా సొరకాయ వడలు తయారు చేసుకునే తిన్నారా. ఒకవేళ తినకపోతే ఇంట్లోనే రుచికరమైన సొరకాయ వడలు ఎలా తయారు చేసుకోవాలి? అందుకు ఏఏ పదార్థాలు కావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
సొరకాయ వడలు కావాల్సిన పదార్థాలు:
సొరకాయ తురుము – రెండు కప్పులు
బియ్యం పిండి – ఒక కప్పు
శెనగపిండి – అర కప్పు
జీలకర్ర -అర టీ స్పూన్
ఉల్లిపాయ తరుగు – అరకప్పు
అల్లం తరుగు – ఒక టీస్పూన్
ఉప్పు- రుచికి తగినంత
పచ్చిమిరపకాయల – సరిపడా
సొరకాయ వడలు తయారీ విధానం:
ఇందుకోసం ఒక పాత్రలో బియ్యం పిండి, శనగపిండి అలాగే జీలకర్ర, ఉల్లిపాయ తరుగు, అల్లం తరుగు వేసుకోవాలి. అలాగే ఇందులో రెండు కప్పుల సొరకాయ తురుము కూడా వేసుకోవాలి. వీటిలో కొద్దిగా నీరు పోసి పిండి కాస్త మందం అయ్యేలా చూసుకోని కలుపుకోవాలి. వడలు వేసే పిండి మాదిరిగా జారుడుగా ఉండాలి. బాణలిలో నూనె పోసి కాచాలి. నూనె వేడి అయ్యాక సొరకాయ వడలు వేసి బంగారు రంగు వచ్చేవరకు వడలను కాల్చుకోవాలి. అంతే రుచికరమైన సొరకాయ వడలు రెడి. వీటిని ఈవినింగ్ స్నాక్స్ గా తింటే చాలా బాగుంటుంది.