Site icon HashtagU Telugu

Sorakaya Pachadi: సొరకాయ పచ్చడి ఇలా చేస్తే కొంచెం కూడా మిగలదు?

Mixcollage 09 Feb 2024 07 23 Pm 929

Mixcollage 09 Feb 2024 07 23 Pm 929

మామూలుగా మనం సొరకాయతో సొరకాయ పప్పు, సొరకాయ తాలింపు, సొరకాయ వడలు లాంటి రకరకాల రెసిపీలు తినే ఉంటాం. అయితే సొరకాయతో ఎప్పుడు ఒకే విధమైన వంటలు తినే బోర్ కొడుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏదైనా సరికొత్తగా ట్రై చేయాలని అనుకుంటూ ఉంటారు. మీరు కూడా అలా సరికొత్తగా ఏదైనా సొరకాయతో ట్రై చేయాలనుకుంటున్నారా. అయితే ఎంతో టేస్టీగా సొరకాయ పచ్చడిని ట్రై చేయండిలా.

సొరకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు :

సొరకాయ – 600 గ్రాములు
పచ్చిమిర్చి – 10
పసుపు – పావు టీ స్పూన్
చింతపండు- కావలసినంత
వెల్లుల్లి రెబ్బలు – 10
పోపు దినుసులు – ఒక చిన్న కప్పు
ఉప్పు – తగినంత

సొరకాయ పచ్చడి తయారీ విధానం:

ఇందుకోసం ముందుగా పొట్టు తీసుకున్న సొరకాయను మంచినీటితో శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత కొంత సొరకాయకు నూనె రాసి చిన్న చిన్న గాట్లను పెట్టాల్సి ఉంటుంది. ఇలా గాట్లను పెట్టుకున్న సొరకాయను స్టవ్ పైన నల్లగా అయ్యేంతవరకు స్లో ఫ్లేమ్‌లో కాల్చుకోవాలి. ఆపై వాటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కలను ఒక పక్కన పెట్టుకొని తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో నువ్వులను వేయించుకోవాలి ఇలా వేయించుకున్న నువ్వులను ఒక గిన్నెలోకి తీసుకొని, అదే కడాయిలో బాగా నూనెను వేడి చేయాల్సి ఉంటుంది. ఇలా వేడి చేసిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి వేసి వాటిని కూడా మరో ప్లేట్లోకి తీసుకోవాలి. కడాయిలో మిగిలిన నూనెలో సొరకాయ ముక్కలను వేసుకొని నెమ్మదిగా ఐదు నిమిషాల నుంచి 6 నిమిషాల వరకు తక్కువ ఫ్లేమ్‌లో బాగా వేయించుకోవాలి. వేయించిన తర్వాత పక్కన తీసుకొని అందులోనే తగినంత చింతపండును వేసుకోవాలి.