Site icon HashtagU Telugu

Bone density loss : ఎముకలను గుళ్ల చేస్తున్న కొన్ని రకాల ఫుడ్స్.. అవెంటో ఓ సారి చూసేయండి

Bone Density

Bone Density

Bone density loss : సాధారణంగా పాల ఉత్పత్తులు ఎక్కువగా తీసుకుంటే ఎముకలకు ఆరోగ్యం లభిస్తుందని అందరూ చెబుతుంటారు. ఎందుకంటే అందులో కాల్షియం ఉంటుంది. మరికొందరు అధికంగా పాల ఉత్పత్తులు తీసుకోవడం మంచిది కాదని, అది కొవ్వులకు కారకం అవుతుందని కూడా అంటుంటారు. దీంతో శరీరంపై ప్రతికూల ప్రభావం పడుతుందని కొందరు నమ్ముతారు.కానీ, దీనిపై శాస్త్రీయంగా ఎలాంటి ఆధారాలు లేవు. ఆరోగ్యకరమైన ఎముకలకు కాల్షియం అవసరం. అది పాలు, పెరుగు, జున్ను వంటి పాల ఉత్పత్తులలో అధికంగా లభిస్తుంది. వాస్తవానికి, డైటరీ కాల్షియం యొక్క ప్రధాన వనరులలో ఇవి ఒకటి. అయితే, మీ శరీరానికి అవసరమైన కాల్షియం పాలు, పెరుగు, జున్ను ద్వారా మాత్రమే కాకుండా, అనేక ఇతర ఆహారాల ద్వారా కూడా పొందవచ్చు. కానీ, కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవడం వలన ఎముకలకు నష్టం జరుగుతుందని చాలా మందికి తెలియకపోవచ్చు.

BJP : సచివాలయం ముట్టడి పిలుపుతో నగరంలో బీజేపీ నాయకుల ముందస్తు అరెస్టు

అధిక సోడియం ఆహారాలు
ప్రాసెస్ చేసిన ఆహారాలు, ప్యాక్ చేసిన స్నాక్స్, క్యూర్ చేసిన మాంసాలలో అధికంగా ఉండే సోడియం ఎముకల ఆరోగ్యానికి హానికరం. ఎందుకంటే, సోడియం శరీరం నుంచి కాల్షియంను మూత్రం ద్వారా బయటకు పంపిస్తుంది. దీనివల్ల ఎముకలలో కాల్షియం తగ్గుతుంది. ఎముకలు బలహీనపడటానికి ఇదొక ప్రధాన కారణం. అంతేకాకుండా కొందరు బయట దొరికే ప్రాసెస్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ అధికంగా తీసుకుంటుంటారు. అందులో కెమికల్స్ వాడకం అధికంగా ఉంటుంది. అవి శరీరానికి తీవ్ర హాని కలిగిస్తాయి. చల్లటి వస్తువులు, సోడియం లెవల్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ మంచివి కావు.

పొటాటో చిప్స్
పొటాటో చిప్స్, ప్యాక్ చేసిన స్నాక్స్, ఫ్రైడ్ ఫుడ్స్ వంటి వాటిలో ఫాస్ఫేట్ ఎక్కువగా ఉంటుంది. ఫాస్ఫేట్ ఎముకల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఎందుకంటే, ఫాస్ఫేట్ మూత్రపిండాల ద్వారా కాల్షియంను బయటకు పంపుతుంది. దానివల్ల ఎముకల సాంద్రత తగ్గుతుంది. అంతేకాకుండా, ఇది ఎముకలను బలహీనంగా మార్చి, ఎముకల పగుళ్లకు కూడా దారితీస్తుంది.

సాఫ్ట్ డ్రింక్స్, చక్కెర పానీయాలు
అధిక చక్కెరతో కూడిన సాఫ్ట్ డ్రింక్స్, సోడాలు, ఎనర్జీ డ్రింక్స్ వంటివి ఎముకల ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. ఈ పానీయాలలో ఫాస్ఫారిక్ యాసిడ్ ఉంటుంది. ఇది ఎముకల నుంచి కాల్షియంను తొలగిస్తుంది. ఫలితంగా ఎముకలు బలహీనపడతాయి. అధిక చక్కెర పానీయాలు ఎముకల సాంద్రతను తగ్గించి, ఎముకల బలహీనతకు దారితీస్తాయి. ఈ పానీయాలను తీసుకోవడం వల్ల ఎముకలు బలహీనంగా మారతాయి.

ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి, ఈ హానికరమైన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. కాల్షియం, విటమిన్ డి, మెగ్నీషియం, పొటాషియం వంటివి పుష్కలంగా ఉన్న ఆహారాలను తీసుకోవడం ఎముకలను బలంగా ఉంచుతుంది. నిమ్మకాయ, నారింజ, బచ్చలికూర, క్యారెట్లు, పండ్లు, కూరగాయలు, చేపలు, పాలు వంటి ఆరోగ్యకరమైన ఆహారాలను ఎంచుకోవడం ద్వారా ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం కూడా ఎముకల బలాన్ని పెంచడంలో సహాయపడుతుంది.

Funny Complaint : లడ్డూ కోసం సీఎం హెల్ప్‌లైన్‌కు ఫోన్.. మధ్యప్రదేశ్‌లో వింత సంఘటన

Exit mobile version