మామూలుగా బయట పనులకు వెళ్లే వారికి పాదాల పగుల సమస్యలు రావడం అన్నది కావాలి. ముఖ్యంగా మడమలు పగిలి విపరీతంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కనీసం నడవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. శీతాకాలంలో అయితే చెప్పాల్సిన పనిలేదు. కొన్నిసార్లు ఈ పగిలిన మడమల నుంచి రక్తం కూడా వస్తూ ఉంటుంది. అయితే ఈ పగిలిన మడమలను తగ్గించుకోవడం కోసం ఎన్నో రకాల స్ప్రేలు, ఆయింట్మెంట్లు, నాచురల్ రెమిడీస్ ని ఫాలో అవుతూ ఉంటారు. అయినా కూడా మంచి ఫలితాలు కనిపించవు. సమయంలో ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
పాదాల పగుళ్ళ సమస్యను తగ్గించడంలో నిమ్మరసం ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం రెండు లేదా మూడు చుక్కల నిమ్మరసంలో ఒక టీ స్పూన్ వ్యాసలీన్ వేసి మిక్స్ చేసి పాదాలకు బాగా అప్లై చేయాలి. ఈ మిశ్రమాన్ని పాదాలకు అప్లై చేసి మర్దన చేసి 20 నిమిషాల పాటు అలాగే వదిలేసి ఆ తర్వాత కడిగేయడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయట. వారానికి మూడు లేదా నాలుగు సార్లు అప్లై చేయడం వల్ల పాదాల పగుళ్లు క్రమంగా తగ్గుతాయని చెబుతున్నారు.
కొబ్బరి నూనె కూడా మడమల పగల సమస్యకు ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం కొబ్బరి నూనె తీసుకొని పాదాలకు అప్లై చేసి బాగా మసాజ్ చేయాలి. కొబ్బరి నూనె కాళ్లకు పట్టించి మసాజ్ చేసి ఉదయాన్నే శుభ్రం చేయడం వల్ల పాదాల పగుళ్లు తగ్గిపోతాయట. ఈ విధంగా క్రమం తప్పకుండా కొన్ని రోజులపాటు చేయాలని చెబుతున్నారు..
ఉప్పు కూడా పాదాల మడమల పగుళ్ల సమస్యకు ఎంతో బాగా ఉపయోగపడుతుందట. ఉప్పు పగుళ్లను కూడా తగ్గిస్తుందని చెబుతున్నారు. ఇందుకోసం గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు వేసి అందులో పాదాలను మొత్తం ముంచాలట. తర్వాత బయటకు పాదాలను తీసివేసి శుభ్రంగా కడగాలని చెబుతున్నారు. ఇలా క్రమం తప్పకుండా చేయాలని చెబుతున్నారు.
పసుపు కూడా ఇందుకు ఎంతో బాగా ఉపయోగపడుతుంది. పసుపులో ఉండే ఖర్కుమిన్ అనే సమ్మేళనం పాదాలను మరింత సున్నివంతంగా మారుస్తుంది. ఇందుకోసం పసుపు తులసి కర్పూరాలను సమాన పరిమాణంలో తీసుకొని అలోవెరా జెల్ కలిపి పగిలిన మడమలపై అప్లై చేయాలి. వారానికి ఒక్కసారి ఇలా చేసినా చాలా మంచి ఫలితాలు కనిపిస్తాయి అని చెబుతున్నారు.