Stomach Cancer: ఈ ఆహారాలు తింటే క్యాన్సర్ వస్తుందట.. అవేంటో తెలుసా?

మనం తినే కొన్ని రకాల ఆహార పదార్థాల వల్ల క్యాన్సర్ల ప్రమాదానికి దారితీస్తాయి. ఆహార పదార్థాల వల్ల వచ్చే క్యాన్సర్లలో

  • Written By:
  • Publish Date - November 23, 2022 / 07:00 AM IST

మనం తినే కొన్ని రకాల ఆహార పదార్థాల వల్ల క్యాన్సర్ల ప్రమాదానికి దారితీస్తాయి. ఆహార పదార్థాల వల్ల వచ్చే క్యాన్సర్లలో కడుపు క్యాన్సర్ కూడా ఒకటి. ఈ కడుపు క్యాన్సర్ అనేది పైలోరస్ అని పిలిచే కడుపు దిగువ భాగంలో క్యాన్సర్ వస్తుంది. ఈ మధ్యకాలంలో ఈ కడుపు క్యాన్సర్ బారిన పడే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మరి ఎటువంటి ఆహారాలు కడుపు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అందులో భాగంగా ఉప్పు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు కడుపు కాన్సర్ కు దారి తీస్తాయి. మరి ముఖ్యంగా ఊరగాయ వంటివి ఎక్కువ ఉప్పును కలిగి ఉంటాయి.

ఇందులో ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలను తినడం వలల ఎన్ నైట్రోసో సమ్మేళనాలు సంశ్లేషణకు కారణం అవుతాయి. ఉప్పును అధికంగా తీసుకోవడం వల్ల కడుపు క్యాన్సర్, అన్నవాహిక క్యాన్సర్ తో పాటుగా ఎన్నో రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది. అలాగే అపరిశుభ్రమైన ఆహారాన్ని తినడం వల్ల ఫుడ్ పాయిజన్ కడుపు క్యాన్సర్ వస్తుంది. హెచ్ పెలోరి సక్రామ్యత అనేది కడుపులోని పైలోరస్ భాగం కడుపు క్యాన్సర్ తో సంబంధం కలిగి ఉండి ఇది కలుషితమైన ఆహారం ద్వారా వస్తుంది. అంతేకాకుండా ఇది గ్యాస్ట్రైటిక్ కు కూడా కారణం కావొచ్చు. ఈ మధ్యకాలంలో చాలామంది ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తినడానికి మొగ్గు చూపుతూ ఉంటారు.

ప్రాసెస్ చేస్తున్న మాంసాన్ని తినడం వల్ల కడుపు క్యాన్సర్ తో పాటు ఇంకా ఎన్నో రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది. ప్రాసెస్ చేసిన మాంసాన్ని తినడం వల్ల కార్సినోజెనిక్, కొలెరెక్టల్ క్యాన్సర్ ప్రమాదం 18 శాతం పెరుగుతుంది. ప్రాసెస్ చేయబడిన ఆహారాలు ఆరోగ్యానికి అస్సలు తినకూడదు. ప్యాకేజ్డ్ స్వీట్, టేస్టీ చిరుతిళ్లు, సోడా, ఎనర్జీ డ్రింక్స్, ఉదయం తృణధాన్యాలు, అల్ట్రా ప్రాసెస్డ్ మాంసం ఉత్పత్తులు, స్తంభింపచేసిన పిజ్జాలు, క్యాండీలు ఇలా ఎన్నో రకాల ఆహార పదార్థాలు కడుపు క్యాన్సర్ ను మరింత పెంచుతాయి. ప్రాసెస్ చేసిన ఆహారాలు తినడం వల్ల క్యాన్సర్ తో గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటీస్ తో పాటుగా మరెన్నో ప్రాణాలను తీసే దీర్ఘకాలిక రోగాలు వస్తాయి.