Site icon HashtagU Telugu

Dried Rose Benefits: ఎండిపోయిన గులాబీలను పాడేస్తున్నారా.. వాటి వల్ల కలిగే ప్రయోజనాలు గురించి తెలిస్తే మాత్రం?

Mixcollage 15 Jan 2024 04 37 Pm 9203

Mixcollage 15 Jan 2024 04 37 Pm 9203

మామూలుగా గులాబీ పూలను దేవుళ్ళను పూజించడానికి అలాగే స్త్రీలు తలలో పెట్టుకోవడానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఎక్కువ శాతం మంది మహిళలు గులాబీ పూలను అమితంగా ఇష్టపడుతూ ఉంటారు. ఇక గులాబీ పూలను ఒకసారి ఉపయోగించిన తర్వాత అవి కొంచెం వాడు తగలగానే వాటిని పారేస్తూ ఉంటారు. ఇక అవి ఎండిపోయాయి అంటే వెంటనే వాటిని బయటకు విసిరేస్తూ ఉంటారు. మీకు తెలుసా ఈ ఎండిపోయిన గులాబీల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.. మరి ఎండిపోయిన గులాబీ వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఈ ఎండిన గులాబీ రేకులను రెండు సంవత్సరాల వరకూ నిల్వ చేయవచ్చు. ఎండి గులాబీ రేకులతో టీ తయారు చేయడం చాలా సులభం. ఈ టీ ఎంతో ఆరోగ్యంతో పాటు రుచి కూడా కలిగి ఉంటుంది. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో ఎండిన గులాబీ రేకులను వేసి 15 నుంచి 20 నిమిషాల పాటు బాగా మరిగించాలి. ఇప్పుడు టీ ఎరుపు రంగులోకి వస్తుంది. దాన్ని ఫిల్టర్ చేసి టీని తాగడమే. ఎండిన గులాబీ రేకులతో కొవ్వొత్తి కూడా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా మంది ఇలానే తయారు చేస్తున్నారు. ఇంట్లో అలంకరించుకోవడానికి ఇవి బాగా హెల్ప్ అవుతాయి. మైనం వేడి చేసి, గులాబీ రేకుల పొడి లేదా గులాబీ రేకులను కూడా అందులో వేడి కొవ్వొత్తిలా తయారు చేసుకోవచ్చు.

చాలా మంది రోజ్ వాటర్‌ను బయట కొనుగోలు చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఎండిన గులాబీ రేకులతో ఇంట్లో తయారు చేసుకోవడం వల్ల మీ డబ్బు ఆదా అవుతుంది. ఈ రోజ్ వాటర్ తయారు చేయడానికి 30 నిమిషాల పాటు నీటిలో గులాబీ రేకులు వేసి ఉడకబెట్టాలి. తర్వాత దీన్ని బాగా చల్లార్చి గాలి చొరబడని కంటైనర్‌లో నిల్వ చేసుకోవాలి. అంతే రోజ్ వాటర్ రెడీ.. ఎండిన గులాబీ రేకులతో స్క్రబ్ కూడా తయారు చేసుకోవచ్చు. గులాబీ రేకులను బాగా ఎండలో ఎండపెడితే రేకుల్లా తయారవుతాయి. వీటిని మీక్సీలో వేసి కాస్త బరకగా తయారు చేసుకోవచ్చు. వీటిలో ఓట్స్ పొడిని కలుపుకుని స్క్రబ్‌లా ఉపయోగించుకోవచ్చు.