Fish Fry: చిన్న చేపలు ఇలా ఫ్రై చేస్తే చాలు.. టేస్ట్ వేరే లెవెల్ అంతే?

మనలో చాలా తక్కువ మంది మాత్రమే చేపలను తింటూ ఉంటారు. చేప కబాబ్, చేప పులుసు, చేప కర్రీ ఇలా ఎన్నో రకాల రెసిపీలు తయారు చేసుకొని తింటూ ఉంటా

  • Written By:
  • Publish Date - March 24, 2024 / 08:20 PM IST

మనలో చాలా తక్కువ మంది మాత్రమే చేపలను తింటూ ఉంటారు. చేప కబాబ్, చేప పులుసు, చేప కర్రీ ఇలా ఎన్నో రకాల రెసిపీలు తయారు చేసుకొని తింటూ ఉంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు చేపలు చాలామంది చేయడం సరిగ్గా రాదు. చిన్న చిన్న చేపలతో చేపల కూర చేయాలనుకున్నప్పటికీ అవి సరిగా రాక చాలామంది ఎలా చేయాలో తెలియక ఆలోచిస్తూ ఉంటారు. మీరు కూడా చిన్న చేపలతో చేపల కూర తయారు చేయాలి అనుకుంటే ఈ రెసిపీ పాటించాల్సిందే.

కావాల్సిన పదార్థాలు
చిన్న చేపలు – పది
పసుపు – పావు టీస్పూను
అల్లం వెల్లుల్లి పేస్టు – మూడు స్పూన్లు
కారం – రెండు స్పూన్లు
జీలకర్ర పొడి – ఒక టీస్పూను
ధనియాల పొడి – ఒక టీస్పూను
కార్న్ ఫ్లోర్ – ఒక స్పూను
నిమ్మరసం – ఒక స్పూను
బియ్యంపిండి – ఒక స్పూను
ఉప్పు – రుచికి సరిపడా
నూనె – వేయించడానికి సరిపడా
కరివేపాకులు – గుప్పెడు
పచ్చిమిర్చి – నాలుగు

తయారీ విధానం :

ఇందుకోసం ముందుగా పసుపు, ఉప్పు వేసి చేపలు బాగా కడిగితే పచ్చి వాసన పోతుంది. తర్వాత ఒక గిన్నెలో అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, ధనియాల పొడి, పసుపు, జీలకర్ర పొడి, కార్న్ ఫ్లోర్, బియ్యం పిండి, నిమ్మరసం, ఉప్పు వేసి బాగా కలపాలి. మరీ పొడిపొడిగా ఉంటే కాస్త నీళ్లు కలుపుకోవచ్చు. చిన్న చేపలకు కత్తితో చిన్న గాట్లు పెట్టాలి. పై మిశ్రమాన్ని చేప మొత్తానికి పట్టేలా రాయాలి. అలా ఒక పావుగంట సేపు వదిలేయాలి. ఆ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కాక ఒక్కో చేపని అందులో వేయాలి. మంట మాత్రం తక్కువగా ఉండేట్టు చూసుకోవాలి. ఆపై కడాయిలో ఉన్న నూనె ఎక్కువగా ఉంటే కొంత తీసి పక్కన పెట్టుకోండి. తక్కువే ఉంటే అందులో కరివేపాకులు, నిలువుగా కోసిన పచ్చిమిర్చి వేసి వేయించాలి. చేపలు కూడా అందులో వేసేయాలి. అంతే టేస్టీ చిన్న చేపల వేపుడు రెడీ అయినట్టే.