Site icon HashtagU Telugu

Sleeping On Stomach: రాత్రి ఈ పొజిషన్లో నిద్రపోతే యమ ఖతర్నాక్.. ఈ తప్పులు చేయొద్దు సుమా!!

Sleeping

Sleeping

మనకు నిద్ర ఎంత ముఖ్యమో.. నిద్రపోయే స్టైల్ కూడా అంతే ముఖ్యం!! నిద్రపోయే భంగిమను బట్టి కూడా మన ఆరోగ్యం డిసైడ్ అవుతుంది. కొన్ని రకాల పొజిషన్లలో నిద్రపోతే ఆరోగ్యానికి చేటు జరుగుతుందని నిపుణులు అంటున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఎడమవైపు తిరిగి పడుకుంటే..

ఎడమవైపు తిరిగి పడుకోవడం అనేది చాలా ఎక్కువ మంది పాటించే నిద్ర పొజిషన్. ఇలా పడుకున్నప్పుడు తిన్న ఆహారం చక్కగా అరుగుతుంది. కాకపోతే ఇలా పడుకునేవారికి… ఎడమ భుజంలో నొప్పి వచ్చే ప్రమాదం ఉంటుంది. ఎడమ కాలుపైనా బరువు ఎక్కువ పడుతుంది. కొద్ది సేపు ఇలా పడుకోవచ్చు గానీ… రాత్రంతా ఇలా పడుకోవడం మంచిది కాదు. ఇక కుడివైపుకి తిరిగి పడుకోవడం అత్యంత ప్రమాదకరం. అలా పడుకునేవారికి ఆహారం సరిగా జీర్ణం కాదు. గుండెలో నొప్పి కూడా వచ్చే ముప్పు ఉంటుంది.

కుర్చీలోనో, సోఫాలోనో వద్దు..

కుర్చీలోనో, సోఫాలోనో నిద్రపోతే… అది సరైన నిద్ర కాదు. బెడ్‌పై లేదా… నేలపై పడుకున్నప్పుడే సరైన నిద్ర అవుతుంది. పగటివేళ పనులు చేసుకునేటప్పుడు నిద్ర వస్తున్నట్లైతే… వారు రాత్రివేళ సరిగా నిద్రపోవట్లేదని అర్థం. అలాంటి వారు నిద్ర సమయాన్ని పెంచుకోవాలి. సరిగా నిద్రపోకపోతే… బ్రెయిన్ త్వరగా దెబ్బతింటుంది

పొట్టను పైకి ఉంచి..

పొట్టను పైకి ఉంచి పడుకుంటే మెడ, వెనక భాగం దగ్గర కొంత అసౌకర్యంగా ఉంటుంది. అక్కడి కండరాలు ఇబ్బంది పడతాయి. ఈ పొజిషన్ వల్ల ఉన్న ఒకే ఒక్క సమస్య గురక. నోరు మూసి నిద్రపోతే… అది ఉండదు.

పొట్టను నేలపై ఆనించి..

ఇక పొట్టను నేలపై ఆనించి నిద్రపోవడం కొంత మందిలో కనిపిస్తూ ఉంటుంది. అలా పడుకోవద్దని పెద్దలు చెబుతుంటారు. అందుకు బలమైన కారణం ఉంది. అలా పడుకోవడం పూర్తిగా అనారోగ్యకరం. దాని వల్ల తలను అటో, ఇటో ఎటో ఒకవైపు తిప్పి పడుకోవాల్సి వస్తుంది. దాంతో మెడనొప్పి వస్తుంది. వెన్ను నొప్పి కూడా వస్తుంది. వెన్నుపూస ఓ పద్ధతి లేకుండా అయిపోతుంది. అది ప్రమాదకరం. మెడ దగ్గర అసౌకర్యం వల్ల సరిగా నిద్ర పట్టదు. ఇలా పడుకున్నప్పుడు కూడా గురక సమస్య ఉంటుంది. కాబట్టి ఏ విధంగానూ ఈ పొజిషన్‌లో అస్సలు పడుకోకూడదు.

ఛాతి మీద పడుకున్నట్లయితే ..

మీ ముఖాన్ని మంచానికి ఆన్చి, మీ ఛాతిని పరుపుకు వ్యతిరేకదిశలో ఉంచి నొక్కటం వల్ల, మీరు దూకుడు తో ఉన్న వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నప్పటికీ – మీపై వచ్చే విమర్శలను సరైన రీతిలో ఎదుర్కొనలేరు.ఈ విధమైన స్థితిలో నిద్రపోవడం వల్ల మీకు మంచి కన్నా ఎక్కువ నష్టం జరగడానికే ఆస్కారం ఉంది.ఈ స్థితిలో పడుకోవటం వల్ల మీ మెడ నలిగి కి ఉన్న కారణం చేత శ్వాసించడం కష్టతరంగా ఉంటుంది, అందువల్ల మీకు మెడ మరియు భుజం నొప్పులు తరచుగా వస్తూ వుంటాయి. ఈ స్థితిలో పడుకోవడం వల్ల మీ ఛాతిని నొక్కి ఉంచడం వల్ల మీరు పూర్తిగా శ్వాసని పొందలేరు. మరియు మీరే టీనేజ్ అమ్మాయిగానే అయితే మీరు రొమ్ముల అభివృద్ధిని నిరోధించగలదు.

ప్రక్కకు తిరిగి నిటారుగా పడుకోవటం..

నిటారుగా ఉన్న కర్ర మాదిరిగా రెండువైపులా చేతులను ఉంచి పక్కకు తిరిగి పడుకొని ఉన్నట్లయితే, వ్యక్తిత్వం అధ్యయనం ప్రకారం; మీరు జీవితంలో చాలా సులభంగా ముందుకు వెళ్తారు. సామాజిక వ్యక్తిగా పరిగణించబడతారు. అయినప్పటికీ, కొంత అవివేకంతో ఉంటారు.కానీ ఇది మీ ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది ?
మీరు ఒకవేళ మహిళా గాని అయితే, మీ రొమ్ములు సాగుతాయి. మీ చేతిని మంచానికి ఆన్చినప్పుడు , తిమ్మిర్లు కలిగే భావనను పొందటం, రక్తప్రసరణ సరిగా అందకపోవడం వంటి సమస్యలకు కారణం కావచ్చు.