Sleep Tourism: స్లీప్ టూరిజం పిలుస్తోంది..

ఏ మనిషికైనా కావలసింది రెండు అవసరాలు. ఒకటి మంచి విశ్రాంతి. రెండు మంచి నిద్ర. ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు.

ఏ మనిషికైనా కావలసింది రెండు అవసరాలు. ఒకటి మంచి విశ్రాంతి. రెండు మంచి నిద్ర. ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు. మంచి నిద్ర (Sleep) వల్లే మంచి ఆరోగ్యం ఉంటుంది. నిద్ర పట్టకపోవడం కంటి నిండా నిద్ర లేదనే బాధ ఉండటం మంచిది కాదు. స్థలం మారిస్తే ఆరోగ్యం బాగుపడినట్టు స్థలం మారిస్తే మంచి నిద్ర పట్టొచ్చు. అంతే కాదు పోటీ ప్రపంచానికి దూరంగా ఒత్తిడి లేకుండా విశ్రాంతి కూడా తీసుకోవచ్చు.కాబట్టి ఈ కొత్త ట్రెండ్‌కు స్వాగతం చెప్పండి. మీకు నిద్రలేమి బాధ ఉంటే గనుక వెంటనే బ్యాగ్‌ సర్దుకోండి.

టూరిజం రూపు రేఖలు మారుతున్నాయి. సస్టెయినబుల్ టూరిజం, ఫుడ్ టూరిజం, ఎక్స్‌పరిమెంటల్ టూరిజం, వెల్‌నెస్ టూరిజం ఇలా ఎన్నో వచ్చాయి. ఇప్పుడు స్లీప్ టూరిజం (Sleep Tourism) పై చర్చ జరుగుతోంది. ఎక్కడికైనా టూర్ కు వెళ్లి ప్రశాంతంగా నిద్రపోవడమే స్లీప్ టూరిజం. దీనివల్ల గజిబిజి లైఫ్‌ నుంచి కాస్త రిలాక్సేషన్‌ లభిస్తుంది. ఈ మధ్య యువత ప్రధానంగా ఈ స్లీప్ టూరిజంపై ఆసక్తి చూపుతోంది. మన దేశంలో స్లీప్ టూరిజం (Sleep Tourism) సేవలు పొందే ప్రదేశాల గురించి తెలుసుకుందాం.

పెల్లింగ్

సిక్కిం రాజధాని గ్యాంగ్‌టాక్‌కు 120 కిలోమీటర్ల దూరంలో ఉండే పెల్లింగ్ హ్యాపీగా నిద్రపోడానికి అనుకూలంగా ఉంటుంది. చుట్టూ పచ్చదనం, అందమైన కొండలు, లోయలు, అద్భుతమైన లొకేషన్లు పెల్లింగ్‌ని ప్రత్యేకంగా నిలుపుతాయి.

దువార్స్

పశ్చిమ బెంగాల్‌లోని దువార్స్ అనే పట్టణం అత్యంత రమణీయంగా ఉంటుంది. అక్కడ ఉండే తేయాకు తోటలు ఈ ప్రాంతంలోని అందాలను రెట్టింపు చేస్తాయి. ఇక్కడ మంచి రిసార్టులు కూడా ఉంటాయి. దీంతో స్లీప్ టూరిజాన్ని కోరుకునేవారికి అది సరైన గమ్యస్థానం.

నాకో

హిమాచల్ ప్రదేశ్‌లోని పిన్ డ్రాప్ సైలెన్స్ ప్రాంతంగా గుర్తింపు పొందిన నాకో అనే హిల్‌స్టేషన్ కూడా స్లీప్ టూరిజానికి అనువుగా ఉంటుంది. ఇక్కడ ఎంత చిన్న శబ్దమైనా చాలా దూరం వినిపిస్తుందని అంటారు. ఇక్కడ హాయిగా నిద్రపోవచ్చు.

అలెప్పీ

కేరళలోని అలెప్పీ అందమైన పర్యాటక ప్రదేశం. ఇక్కడి బ్యాక్ వాటర్స్ అందాల కారణంగా కేవలం రొమాంటిక్ ట్రిప్‌లకే కాకుండా ప్రకృతి ఒడిలో సేదతీరేందుకు కూడా ఇది అనువైన ప్రదేశం. అలాంటి చోట హౌస్‌బోట్లలో హాయిగా నిద్రపోవచ్చు.

లేహ్, లద్ధాఖ్

కేంద్రపాలిత ప్రాంతమైన లేహ్, లద్ధాఖ్ చూడాలని కోరుకోని పర్యాటకులు ఉండరు. అక్కడి కొండలు, లోయలు, అందమైన సరస్సులు, ప్రశాంతమైన వాతావరణం ఇట్టే మంత్రముగ్ధులను చేస్తాయి. అలాంటి చోట టూర్ కు వెళ్లి హాయిగా నిద్రపోవచ్చు.

Also Read:  Fruit Juice: ఫ్రూట్ జ్యూస్ ఆరోగ్యానికి హాని చేస్తుందా? 5 సందర్భాలలో దాన్ని తాగొద్దు