Site icon HashtagU Telugu

Pregnancy and Sleep: ఆ సమయాల్లో నిద్రపట్టడం లేదా..?

Sleep Pregnancy Imresizer

Sleep Pregnancy Imresizer

అమ్మా అనే పిలుపు వినాలంటే…ఈ సమయంలో కొన్ని సమస్యలు ఎదుర్కొవల్సిందే. నెలలు నిండుతున్నా కొద్దీ నిద్ర పట్టకపోవడం కూడా వీటిలో ఒకటి. అయితే లైఫ్ స్టైల్ లో కొన్ని మార్పులు చేసుకున్నట్లయితే..ఈ సమస్య నుంచి బయటపడటం అంత కష్టం కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి అవేంటో ఓసారి తెలుసుకుందాం.

సాయంతంలోపే పడుకోవాలి…
ప్రెగ్నెన్సీ సమయంలో ఎదురయ్యే ముఖ్యమైన సమస్యల్లో ఒకటి రాత్రి పూట ఎక్కువగా బాత్ రూంకు వెళ్లాల్సి రావడం. అందుకే మధ్యాహ్నం నుంచి సాయంత్రంలోపు ఎక్కువ మొత్తంలో నీళ్లు తాగాలి. సాయంత్రం నుంచి రాత్రి వరకు కాస్త తక్కువ నీళ్లు తాగుతే సరిపోతుంది. దీనివల్ల రాత్రిపూట మధ్యలో బాత్ రూం కోసం పదే పదే మేలుకోవల్సిన అవసరం రాకుండా ఉంటుంది.

వ్యాయామం….
గర్భవతిగా ఉన్న సమయంలో ఏ పనీచేయకుండా పూర్తిగా విశ్రాంతి తీసుకుంటారు చాలామంది. అది మంచిది కాదు. వైద్యులు ప్రత్యేకంగా సూచిస్తే తప్ప పూర్తి విశ్రాంతి తీసుకోకూడదు. తేలికపాటి వ్యాయామం చేసినట్లయితే…మీకూ…మీ కడుపులోకి బిడ్డకు చాలా మంచిది. దీంతో మీరు రోజంతా ఉత్సాహంగా ఉంటారు. రాత్రి కూడా హాయిగా నిద్రపోతారు. అయితే పడుకోవాడానికి నాలుగు గంటల ముందు ఎక్సర్ సైజ్ చేయకపోవడమే మంచిది. రోజూ వ్యాయామం చేసే సమయాన్ని కూడా గమనించాలి. ఎక్కువ సేపు కూడా చేయకూడదు. వ్యాయామం ఎలాంటిదైనా సరే వైద్యులను సంప్రదించి నిర్ణయం తీసుకోవాలి.

ఒత్తిడికి దూరంగా..
ఆందోళన, ఒత్తిడి ఉన్నట్లయితే…రాత్రి నిద్రపాు చేస్తుంది. ఇంట్లో కానీ ఆఫీసులోకానీ సమస్యలు డెలివరీ గురించి ఉండే భయాలు ఇలా ఏవైనా కావచ్చు. వాటి గురించి ఎక్కువగా ఆలోచించి ఒత్తిడికి గురై నిద్రపోనట్లయితే…మీ బిడ్డ మెదడుపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది. అందుకే ఒత్తిడికి దూరంగా ఉండాలి.

సమయానికి అనుగుణంగా…
రోజూ ఒకే సమయానికి నిద్రపోవడం అలవాటు చేసుకున్నట్లయితే నిద్రపట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పడుకునే ముందు టీవీ చూడటం…మొబైల్ మాట్లాడటం…కంప్యూటర్ వంటివి ఉపయోగించరాదు. కనీసం పడుకునే సమయానికి అరగంట ముందే ఇవన్నీ కూడా ఆపేయడం మంచిది. గోరువెచ్చని నీటితో స్నానం చేయడం, గోరువెచ్చని పాలు తాగడం చేస్తే…చక్కటి ఫలితాలు ఉంటాయి. సుఖంగా నిద్ర పడుతుంది.

రాత్రి నిద్రపోయే ముందు తలను కాళ్లను సున్నితంగా మసాజ్ చేసుకున్నట్లయితే నరాలు ఉత్తేజితం అవుతాయి. దీంతో నిద్ర బాగా పడుతుంది.

Exit mobile version