- శీతాకాలంలో చర్మం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
చలికాలం చర్మ సంరక్షణ చిట్కాలు
చలికాలంలో చర్మం విషయంలో తప్పకుండా పాటించాల్సిన జాగ్రత్తలు
Winter Care Tips: చలికాలం వచ్చింది అంటే చాలు చర్మానికి సంబందించిన సమస్యలు తెగ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అందులో చలికాలంలో చర్మం పొడిబారడం, దురద పెట్టడం, పగుళ్లు రావడం, పొరలు పొరలుగా మారడం లాంటి చాలా సమస్యలు రావడం అన్నది సర్వసాధారణం. చలిగాలులు, తక్కువ తేమ వల్ల చర్మం బిగుతుగా మారుతుంటూ ఉంటుంది. అందుకే మాయిశ్చరైజర్ వాడటం, గోరువెచ్చని నీటితో స్నానం చేయడం, చర్మం పొడిబారకుండా ఉండే నూనెలు, లోషన్లు వాడటం, నీళ్లు ఎక్కువగా తాగడం వంటివి చేస్తే చర్మాన్ని తేమగా, మృదువుగా ఉంచుకోవచ్చట.
స్నానం తర్వాత వెంటనే బాడీ లోషన్ లేదా క్రీమ్ రాసుకోవాలట. ముఖ్యంగా చేతులు, మోచేతులు, పాదాలకు బాడీ లోషన్ రాసుకోవడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు ఉండవు అని చెబుతున్నారు.. వేడి నీటితో స్నానం చేయడం వల్ల చర్మం మరింత పొడిబారుతుంది. కాబట్టి గోరువెచ్చని నీటిని ఉపయోగించడం మంచిదని చెబుతున్నారు. అలాగే ఇంట్లో తేమను పెంచడానికి హ్యూమిడిఫైయర్ ఉపయోగించవచ్చట. ఇది గాలిని తేమగా ఉంచుతుందని చెబుతున్నారు. కొబ్బరి నూనె, బాదం నూనె వంటివి చర్మానికి తేమను అందించి, పగుళ్లు రాకుండా కాపాడతాయట. కాబట్టి వీటిని ఉపయోగించడం మంచిది.
అయితే చలికాలంలో చాలామంది చేసే అతిపెద్ద తప్పు నీరు తక్కువగా తీసుకోవడం. వాతావరణం చల్లగా ఉండటం వల్ల పైగా చలిగా ఉండటం వల్ల చాలామంది నీరు చాలా తక్కువగా తాగుతూ ఉంటారు. ఇంకొందరు పదేపదే మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తుందని కూడా నీరు తాగకుండా ఉంటారు. కానీ అలా అస్సలు చేయకూడదట. చలికాలంలో కూడా మూడు నుంచి ఐదు లీటర్ల నీటిని తీసుకోవాలని చెబుతున్నారు. అలాగే శరీరాన్ని లోపలి నుంచి హైడ్రేట్ చేసుకోవడానికి నీళ్లు, పండ్ల రసాలు తాగాలట. టీ, కాఫీ వంటి పానీయాలు ఎక్కువగా తీసుకోకూడదట. సువాసనలు తక్కువగా ఉండే, సున్నితమైన సబ్బులను ఉపయోగించాలట.
చలికాలంలో చర్మ సంరక్షణ కోసం ఎలాంటి చిట్కాలు పాటించాలో మీకు తెలుసా?
చలికాలంలో చర్మ సంబంధిత సమస్యలతో బాధపడేవారు చర్మం సంరక్షణ కోసం ఇప్పుడు చెప్పబోయే చిట్కాలు పటించాలి అని చెబుతున్నారు. ఇంతకీ ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Winter Care Tips
Last Updated: 17 Dec 2025, 06:16 AM IST