Site icon HashtagU Telugu

Skin : మీ చర్మం నిగనిగలాడాలంటే..డాన్స్ చేయాల్సిందే..

Sjin Dance

Sjin Dance

ఆడ , మగ సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా తమ చర్మం (Skin) ఎప్పుడు నిగనిగలాడాలని..అందరి చూపు తమపైనే పడాలని..అబ్బా ఏముందిరా అనుకోవాలని కోరుకుంటారు. అందుకు గాను మార్కెట్ లో లభించే అనేక బ్యూటీ ప్రొడక్ట్స్ (skin care products) తో పాటు ఆరోగ్య చిట్కాలను ప్రయోగిస్తుంటారు. అయితే వీటివల్ల నిగనిగలాడడం ఏమో కానీ ఉన్న చర్మ పాడైపోతుంటుంది. అందుకే ఇలాంటి వాటికీ దూరంగా ఉంటూ ప్రతి రోజు డాన్స్ (Dance) చేస్తే మీ చర్మం నిగనిగలాడడం గ్యారెంటీ అంటున్నారు. అదేంటి అనుకుంటున్నారా..?

We’re now on WhatsApp. Click to Join.

ప్రతి రోజు డాన్స్ (Dance) లేదా ఎక్సర్సైజ్ (Exercises ) చేయడం వల్ల చెమట ఎక్కువ వస్తుంది. అంటే ఆయిల్, దుమ్ము, ధూళితో నిండిన చర్మ రంధ్రాలు తెరుచుకుంటాయి. చెమట వల్ల చర్మం క్లీన్ అయ్యి యాక్నె సమస్యలు రావు. స్కిన్ ఇన్ఫ్ మేషన్ ని తగ్గించే హార్మోన్స్ కూడా రెగ్యులేట్ అవుతాయి. దానివల్ల తామర, సోరియాసిస్ లాంటి చర్మ సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. అలాగే డాన్స్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి, చర్మ కణాలకి సరిపడా ఆక్సిజన్, పోషకాలు అందుతాయి. దాంతో నేచురల్గానే చర్మం మెరుస్తుంది. ప్రతి 28 రోజులకి చర్మం దానంతట అదే క్లీన్ అవుతుంది. నెలకోసారి చర్మం కొత్త కణాలని తయారు చేసుకుంటుంది. అందువల్ల చర్మానికి ప్రత్యేకంగా ట్రీట్మెంట్ అవసరం లేదు. వీటితో పాటు హెల్దీ స్కిన్ కోసం సరిపడా వాటర్ ఎక్కువగా తాగాలి. పండ్లు, ఆకుకూరలు వీలైనంత ఎక్కువ తినాలి. ఆయిల్ ఫుడ్ తక్కువగా తీసుకోవాలి. ఇలా చేస్తే మీ చర్మం నిగనిగలాడుతూ..అందర్నీ ఆకర్షిస్తుంటుంది.

Read Also : Thummala Counter to KCR : అసలు కేసీఆర్ కు మంత్రి పదవి ఇప్పించిందే నేను – తుమ్మల రియాక్షన్