Skin Care: తరచూ స్కిన్ కేర్ ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే?

మామూలుగా స్త్రీ, పురుషులు ప్రతి ఒక్కరూ కూడా అందంగా ఉండడం కోసం ఎన్నో రకాల చిట్కాలను ఉపయోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ని

  • Written By:
  • Publish Date - January 31, 2024 / 05:30 PM IST

మామూలుగా స్త్రీ, పురుషులు ప్రతి ఒక్కరూ కూడా అందంగా ఉండడం కోసం ఎన్నో రకాల చిట్కాలను ఉపయోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో మార్కెట్లోకి అనేక రకాల స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వచ్చాయి. అయితే వాటిలో చాలా వరకు కెమికల్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఎక్కువగా ఉన్నాయి. చాలామందికి ఈ విషయం తెలియక ఏవిపడితే అవి వాడి మొటిమలు మచ్చలు వంటివి సమస్యలను కొని తెచ్చుకుంటూ ఉంటారు. కొత్త స్కిన్ కేర్ ప్రోడ‌క్ట్స్ ని , మాయిశ్చ‌రైజ‌ర్ లాంటివి స్కిన్ కి అప్లె చేస్తూ ఉంటారు. ఈ స్కిన్ కేర్ ప్రోడ‌క్ట్స్ ఏవి మంచివి ఎలా వాడాలి అనేది కొంత‌మందికి పూర్తి అవ‌గాహ‌న ఉండ‌దు. అదేవిధంగా స్కిన్ కేర్ ప్రోడక్ట్లను ఉదయం ఉపయోగించాలా లేక రాత్రిపూట ఉపయోగించాలో అన్న విషయాలు కూడా చాలా మందికి తెలియవు.

కొందరు ఎక్స్పీరియర్ అయినా స్కిన్ కేర్ ప్రోడక్ట్లను కూడా ఉపయోగిస్తూ ఉంటారు. వాటి వల్ల రక రకాల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. అలాగే స్కిన్ కేర్ ప్రోడ‌క్ట్స్ ని అప్లె చేసిన‌పుడు ఒక్కొసారి చిన్న చిన్న గ్రాన్యూల్స్ లాగా స్కిన్ మీద ఉండిపోవ‌డాన్నే పీల్లింగ్ అంటారంటా. ఈ పీల్లింగ్ స్కిన్ మీద ఎందుకు ఉంటుందంటే స్కిన్ పైన ఎదైన అడ్డం ఉండి, ఈ ప్రోడ‌క్ట్స్ ని స్కిన్ లోప‌లికి వెళ్ల‌కుండా అడ్డుప‌డుతుంది. స్కిన్ కేర్ ప్రోడ‌క్ట్స్ ని స‌రైన ప‌ద్ధ‌తిలో అప్లె చేసినా , ఒక ప్రోడ‌క్ట్స్ పూర్తిగా అబ్జర్వ్ అవ్వ‌క‌ముందే మ‌రోక ప్రోడ‌క్ట్ ను అప్లె చేసినా ఇలా జ‌రుగుతుంది. మ‌రి ఈ పీల్లింగ్ ఎర్ప‌డ‌కుండా ఉండాలంటే స్కిన్ కేర్ ప్రోడ‌క్ట్స్ ని ఏ ఆర్డ‌ర్ ల‌లో అప్లె చేయాలో తెలుసుకుందాం.. కాగా ఉద‌యం స‌మ‌యంలో స్కిన్ కేర్ ప్రోడ‌క్ట్స్ ని ఎలా వాడాలి అన్న విషయానికి వస్తే.. విట‌మిన్ సీ సీరం.. ఉద‌యం స‌మ‌యంలో ఎప్పుడు విట‌మిన్ – సీ సీరం వాడ‌టం మంచిది.

వ‌య‌సుతో సంబంధం లేకుండా ప్ర‌తి ఒక్క‌రు విట‌మిన్ సీ సీరం వాడవచ్చు. స‌న్,పొల్యూష‌న్ వ‌ల‌న జ‌రిగే డ్యామేజ్ ను ఈ విట‌మిన్ సీ సీరం రివ‌ర్స్ చేస్తుంది. అలాగే క్లెన్సింగ్ అన్న‌ది స్కిన్న్ కేర్ రోటిన్ లో ప‌స్ట్ స్టెప్ మాత్ర‌మే కాదు, చాలా ముఖ్య‌మైన స్టెప్. మీరు ఎంచుకున్న క్లెన్స‌ర్ మీరు అనుకున్న దాని కంటే ఎక్క‌వ‌గా మీకు హెల్ప్ చేస్తుంది. క్లెన్సింగ్ త‌రువాత మీరు ఎక్కువ‌గా యాక్టివ్ ఇంగ్రిడియెంట్స్ ఉన్న ప్రోడ‌క్ట్స్ ని వాడ‌ద‌లుచుకుంటే జెంటిల్ గా ఉండే ఫేస్ వాష్ ఎంచుకోవడం మంచిది. మ‌రి ఎక్కువ క్లెన్స్ చేసినా , మ‌రి ఎక్కువ సార్లు చేసినా, మ‌రి హ‌ర్ష్ గా ఉంటే క్లెన్స‌ర్ వాడినా క్లెన్స‌ర్ వ‌ల‌న జ‌రిగే హెల్ప్ త‌గ్గిపోతుంది. ఐ క్రీమ్ ని ట్రిట్ క్యాట‌గిరిలో చేర్చుకొవ‌చ్చు. మీ రింగ్ ఫీంగ‌ర్ తో ఐ క్రీమ్ ని డ్యాబ్ చేయండి. రింగ్ ఫీంగ‌ర్ అన్ని వేళ్ళ‌లోకి బ‌ల‌హినంగా ఉండే వేలు. కాబట్టి మ‌నం పొర‌పాటునా చేసినా డ్యామేజ్ లేకుండా ఉంటుంది. టోన‌ర్ అనేది ఆప్ష‌న‌ల్ స్టెప్, కాని మీద్గ‌ర మీరు బాగా ఇష్ట‌ప‌డ్డ టోన‌ర్ మీరు దాన్ని హ్యాపీగా వాడుకోవ‌చ్చు. మీ స్కిన్ బ్యాలెన్స్ చేయ‌డానికి టోన‌ర్ బాగా హెల్ప్ చేస్తుంది.

మీది యాక్నే ప్రొన్ స్కిన్ అయితే శాలీసిలిక్ యాసిడ్ వంటి ఇంగ్రిడియెంట్స్ ఉన్న టోన‌ర్ సెలెక్ట్ చేసుకోవాలి. డ్రై స్కిన్ లేదా సెన్సిటివ్ స్కిన్ అయితే హైడ్రేటింగ్ టోన‌ర్ ని ఎంచుకోండి. తర్వాత మాయిశ్చరైజర్ ని అప్లై చేయాలి. మాయిశ్చ‌రైజ‌ర్ మీ స్కిన్ ని హైడ్రేట్ గా ఉంచుతుంది. ఉద‌యం పూట వాడే మాయిశ్చ‌రైజ‌ర్ కొంచ్చె లైట్ గా ఉండేలా చూసుకోవాలి. అప్పుడు ఇజిగా ఆబ్ఙార్బ్ అవుతుంది. మీ స్కిన్ కేర్ రోటిన్ లో చాలా ఇంపార్టేంట్ స్టెప్ స‌న్ స్క్రిన్. దీనిని యూజ్ చేయ‌క‌పోతే ఇంక ఏవి యూజ్ చేసిన పెద్ద లాభం ఉండ‌దు. మీరు ఇంట్లో ఉన్నా స‌న్ స్క్రిన్ అప్లె చేసుకొవ‌డం అవ‌స‌రం. ఎందుకంటే కీటికీ ల్లోంచి యూవి లేస్ లోప‌లికి చేరుకొని స్కిన్ డ్యామేజ్ కి కార‌ణం అవుతుంది. ఇక్క‌డితో ఉద‌యం స్కిన్ కేర్ అయిపోయింది. నైట్ స్కిన్ కేర్ ఉద‌యం స్కిన్ కేర్ క‌న్నా కొద్దిగా డిఫ‌రేంట్ గా ఉంటుంది. నైట్ టైమ్ వాడే స్కిన్ కేర్ ప్రోడ‌క్ట్స్ స్కిన్ ని త‌న‌ను తాను రిపెయిర్ చేసుకునేందుకు హెల్పుచేసే న్యూట్రియంట్స్ క‌లిగి ఉండాలి .