Lemon Skin Care: మీ అందం మెరిసిపోవాలంటే నిమ్మ పండుతో ఇలా చేయాల్సిందే?

నిమ్మకాయ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. నిమ్మకాయలో విటమిన్ సి తో

  • Written By:
  • Publish Date - February 7, 2024 / 01:45 PM IST

నిమ్మకాయ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. నిమ్మకాయలో విటమిన్ సి తో పాటుగా ప్రోటీన్, కొవ్వు పదార్థాలు, క్యాల్షియం, ఫోలేట్, పొటాషియం వంటివి లభిస్తాయి. ఇందులో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచడంతోపాటు ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. అందుకే నిమ్మకాయను ఆహారంలో భాగం చేసుకోమని చెబుతూ ఉంటారు.. అయితే నిమ్మకాయ కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. మరి నిమ్మకాయతో అందాన్ని ఎలా పెంచుకోవచ్చు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

నిమ్మలో సహజసిద్ధమైన క్లెన్సింగ్ గుణాలు ఉంటాయి. వీటి వల్ల చర్మం బాగా శుభ్రపడి ప్రకాశవంతంగా కనిపిస్తుంది. తాజా చర్మం పొందడానికి రెండు టేబుల్‌ స్పూన్ల రోజ్‌ వాటర్‌లో కొన్ని చుక్కల నిమ్మరసం మిక్స్‌ చేయాలి. ఆ తర్వాత ఈ మిశ్రమంలో కాటన్‌ వస్త్రం ముంచి ముఖానికి అద్దుకోవాలి. దీన్ని 5 నిమిషాల పాటు ఆరనిచ్చి, చల్లని నీళ్లతో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే చర్మం లోతున ఉన్న మురికి తొలగిపోయి ప్రకాశవంతంగా మారుతుంది. జిడ్డు చర్మంతో ఇబ్బంది పడేవారు నిమ్మరసం కలిపిన నీళ్లను తీసుకొని దూదితో ముఖానికి అప్లై చేసి కొద్ది సేపటి తర్వాత ముఖం శుభ్రం చేసుకోవడం వల్ల ఆ సమస్య నుంచి బయటపడవచ్చు.

అదేవిధంగా చెంచా కొబ్బరి నూనెకు, రెండు చెంచాల నిమ్మరసాన్ని కలిపి ముఖానికి మర్దనా చేయాలి. దీన్ని పది నిమిషాల పాటు ఆరనిచ్చి, నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. నిమ్మరసంలోని విటమిన్‌ సి మృత కణాలను తొలగిస్తుంది. ఆరోగ్యవంతమైన చర్మ కణాలు ఎదిగేలా దోహద పడుతుంది. నిమ్మను కొబ్బరి నూనెతో కలపడం వల్ల చర్మం యవ్వనంగా, నిగనిగలాడుతుంది. వేడి నీళ్లలో కొన్ని నిమ్మ చెక్కలను వేసి పాదాలను 10, 15 నిమిషాలు ఉంచాలి. పిండేసిన నిమ్మ డిప్పలను మడమలకు రుద్దినా మంచి ఫలితాలు కనిపిస్తాయి. నిమ్మలోని అల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్‌బిరుసు చర్మాన్ని మెత్తబరుస్తాయి.