Sitting Cross-Legged?: కాలిపై కాలు పెట్టుకొని కూర్చుంటున్నారా? ఐతే ఇది మీకోసమే..!

ఈ అలవాటు వల్ల మీకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంగ్లండ్ లోని లాంకాస్టర్ యూనివర్సిటీలోని క్లినికల్ అనాటమీ లెర్నింగ్ సెంటర్ డైరెక్టర్..

Sitting Cross-Legged? : మీకు కాలుపై కాలు పెట్టుకొని కూర్చునే అలవాటు ఉందా? ఈ అలవాటు రాజసానికి నిదర్శనం అనుకుంటున్నారా?

సమాధానం “అవును” అయినా మీరు అలర్ట్ కావాల్సిందే. ఎందుకంటే.. ఈ అలవాటు వల్ల మీకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంగ్లండ్ లోని లాంకాస్టర్ యూనివర్సిటీలోని క్లినికల్ అనాటమీ లెర్నింగ్ సెంటర్ డైరెక్టర్, ప్రొ. ఆడమ్ టేలర్ (ప్రొఫెసర్ ఆడమ్ టేలర్) రీసెర్చ్ లో ఈవిషయం వెల్లడైంది.

అది ఇల్లు అయినా.. ఆఫీసు అయినా ప్రజలు తరచుగా కుర్చీ లేదా సోఫాలో కూర్చోవడానికి ఇష్టపడతారు. ఎందుకంటే వాటిపై కూర్చోవడం చాలా సౌకర్యంగా ఉంటుంది. కొందరు కాలుపై కాలు పెట్టుకుని కూర్చుంటారు (Sitting). ఈ అలవాటు దీర్ఘకాలంలో శరీరంపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. పురుషులు, స్త్రీల శరీర నిర్మాణంలో తేడాల కారణంగా.. పురుషుల తుంటి కీళ్ళు స్త్రీల కంటే గట్టిగా ఉంటాయి. దీనివల్ల స్త్రీలు కాలిపై కాలు వేసుకొని కూర్చోవడం చాలా సులభం.

కాలుపై కాలు పెట్టుకొని కూర్చుంటే వచ్చే ప్రాబ్లమ్స్..

  1. వెన్నెముక, భుజాల ఎముకలలో నొప్పి కలుగుతుంది.
  2. మెడ ఎముకలో మార్పులకు కారణమవుతుంది. మెడ యొక్క దిగువ భాగాన్ని, దిగువ వీపును మరింత ప్రభావితం చేస్తుంది.
  3. శరీరం యొక్క కుడి, ఎడమ వైపుల మధ్య కండరాల అసమతుల్యత ఏర్పడుతుంది.

స్పెర్మ్ ఉత్పత్తి..

ఒక కాలుపైన మరో కాలు వేసుకుని కూర్చోవడం వల్ల పురుషుడి స్పెర్మ్ కౌంట్‌పై ప్రభావం చూపుతుందని తాజా పరిశోధనలో తేలింది.  సాధారణ సిట్టింగ్ సమయంలో వృషణాల ఉష్ణోగ్రత 2 డిగ్రీల సెల్సీయస్ (35.6F) పెరుగుతుంది. ఈ సంఖ్య క్రాస్ లెగ్డ్ పొజిషన్‌లో కూర్చున్నప్పుడు 3.5 డిగ్రీల సెల్సీయస్ (38.3F) కి పెరుగుతుంది. వృషణాలలోని అధిక ఉష్ణోగ్రతలు పురుషుల స్పెర్మ్ కౌంట్ నాణ్యతను, నంబర్ ను తగ్గిస్తాయి. మహిళలు కాలుపై కాలు వేసుకొని కూర్చుంటే.. సహజంగా గర్భం దాల్చడం కష్టమని పరిశోధనలు చెబుతున్నాయి.

రక్తం గడ్డకట్టడం..

కాలుపై కాలు వేసుకొని కూర్చుంటే.. శరీరంలోని దిగువ అవయవాల రక్తనాళాలలో ఒత్తిడి ఏర్పడుతుంది. ఆ ఒత్తిడి సిరల ద్వారా రక్తం యొక్క కదలికను తగ్గిస్తుంది. ఇది రక్తం గడ్డకట్టడానికి దారితీస్తుంది. రక్తం గడ్డలు రక్తం యొక్క జెల్ (మందమైన పదార్ధం) లాగా కనిపిస్తాయి. రక్తం ద్రవ రూపం నుండి ఘనానికి మారినప్పుడు అవి ఏర్పడతాయి. రక్తం గడ్డకట్టడం అనేది చర్మం కత్తిరించబడినప్పుడు లేదా స్క్రాప్ చేయబడినప్పుడు అధిక రక్తస్రావం నిరోధించడం వంటి సాధారణ శారీరక ప్రతిస్పందన. ఈ ప్రాబ్లమ్స్ ను దృష్టిలో ఉంచుకుని ఎక్కువసేపు ఈ భంగిమలో కూర్చోకండి.

Also Read:  UPI Payments: ఇకపై UPI ద్వారా పేమెంట్స్ చేస్తే మన జేబులు ఖాళీ అవ్వాల్సిందే..!