టమాటాల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికి తెలిసిందే. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తరచుగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చట. కాగా టమాటాలు కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో మేలు చేస్తాయని చెబుతున్నారు. మరి అందుకోసం ఎటువంటి ఫేస్ ప్యాక్ లు ట్రై చేయాలి అన్న విషయానికి వస్తే.. చర్మం రంధ్రాల కవర్ అవటం కోసం ఒక పండు టమాటా రసానికి ఒక టీ స్పూన్ నారింజ లేదా నిమ్మరసం కలపాలి.
ఇది మీ మెడ, ముఖానికి ప్యాక్ లాగా వేయాలి. 30 నిమిషాల సేపు అలాగే ఉంచి ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. తర్వాత బాదం నూనెతో మీ ముఖాన్ని మసాజ్ చేయాలి. దీనివలన మొఖం మీద ఉండే రంధ్రాలు త్వరగా కూడుకుంటాయట. అలాగే బ్లాక్ హెడ్స్ తో బాధపడుతున్నట్లయితే పండిన టమాటాను రెండు ముక్కలుగా కట్ చేసి చక్కెరను అప్లై చేసి వాటిని మీ ముఖంపై చర్మంపై వృత్తాకార కదలికలో రుద్దటం ప్రారంభించాలట. ఈ రసాన్ని ముఖానికి పట్టించి ఐదు నిమిషాలు పాటు ఉంచి, తర్వాత మీ ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలట.
అలాగే పొడి చర్మంతో ఇబ్బంది పడుతున్నట్లయితే రెండు టేబుల్ స్పూన్ల మజ్జిగ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ టమాటా జ్యూస్ కలపాలి. వీటిని బాగా కలిపి అందులో కాటన్ బాల్ ముంచి దానితో మీ ముఖంపై ప్యాక్ లాగా వేసుకోవాలట. తర్వాత 20 నిమిషాలు ఆగి ఆపై చల్లని నీటితో మొహం కడుక్కోవడం వల్ల డ్రై స్కిన్ సమస్య దూరం అవుతుందట. అలాగే జిడ్డు చర్మం ఉన్నట్లయితే టమాటాలను సగానికి కట్ చేసి చర్మాన్ని తీసివేసి మెత్తని గుజ్జుగా చేసి, ఇందులో ఒక టేబుల్ స్పూన్ తాజా దోసకాయ రసం కలపాలట. ఈ మిశ్రమాన్ని పావుగంటసేపు ఫ్రిజ్లో పెట్టి ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని మీ ముఖం మెడ లేదా ప్యాక్ లాగా వేసుకోవాలట. తర్వాత 30 నిమిషాల సేపు అలాగే వదిలేసి తర్వాత చల్లని నీటితో కడుక్కుంటే ముఖం మీద జిడ్డు తగ్గుతుందని చెబుతున్నారు..