Skin Cancer: చర్మ క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఇలా చేయాల్సిందే?

ఈ రోజుల్లో చాలామంది చర్మ క్యాన్సర్ సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. రోజురోజుకీ చర్మ క్యాన్సర్ కేసులు కూడా ఎక్కువ అవుతున్

  • Written By:
  • Publish Date - September 14, 2023 / 09:45 PM IST

ఈ రోజుల్లో చాలామంది చర్మ క్యాన్సర్ సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. రోజురోజుకీ చర్మ క్యాన్సర్ కేసులు కూడా ఎక్కువ అవుతున్నాయి. అయితే ఈ చర్మ క్యాన్సర్ కు ప్రధాన కారణం సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలు. సూర్యుని అతినీలలోహిత కిరణాల ద్వారా కణాల డీఎన్ఏ నాశనం అవుతుంది. అలాగే రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. దీనివల్ల చర్మ క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది. ఆ కిరణాలు చర్మ కణాలలోని డీఎన్ఎను నాశనం చేస్తాయి. ఇది కణాల అనియంత్రిత పెరుగుదల, క్యాన్సర్ అభివృద్ధికి కారణమయ్యే ఉత్పరివర్తనాలకు దారితీస్తుంది.

చర్మం రంగు మారడం, వైకల్యం, చర్మ గాయాలు, చిన్న మచ్చలు, చర్మపు పూతలతో చర్మ క్యాన్సర్ ను గుర్తించవచ్చు. మరి చర్మ క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అందులో మొదటగా చేయాల్సింది ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు బయటకు వెళ్లకపోవడమే మంచిది. ముఖ్యంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పీక్ అవర్స్ లో ఎక్కువ సేపు ఎండ తగలకుండా చూసుకోవాలి. అదేవిధంగా అతినీలలోహిత కిరణాల నుంచి మీ చర్మాన్ని రక్షించడానికి సహాయపడే దుస్తులను వేసుకోవాలి. అంటే శరీరం మొత్తం కప్పి ఉంచే దుస్తులను వేసుకోండి. చాలామంది ఎండలో పనిచేస్తున్నప్పుడు బట్టలు వేసుకోకుండా కేవలం షార్ట్ లాంటిది ధరించి పనిచేస్తుంటారు.

కాని అలా చేయకూడదు. అలాగే బయటకు వెళ్లినప్పుడు హై spfతో సన్ స్క్రీన్ ఉపయోగించండి. spf 30 లేదా అంతకంటే ఎక్కువ బ్రాడ్-స్పెక్ట్రం సన్స్ స్క్రీన్ ను చర్మానికి రాయాలి. అదేవిదంగా మీ చర్మాన్ని తరచుగా చెక్ చేస్తూ ఉండడం మంచిది. అంటే మీ చర్మంపై ఏవైనా చిన్న చిన్న పుట్టుమచ్చలు లేదా మచ్చలు లేదా ఇతర మార్పులు ఉన్నాయేమో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇవి చర్మ క్యాన్సర్ లక్షణాలు. అలాగే బయటకు వెళ్లినప్పుడు సన్ గ్లాసెస్ ను పెట్టుకోవడం తప్పనిసరి. ఇవి అతినీలలోహిత కిరణాల నుంచి మీ కళ్లను రక్షించడానికి సహాయపడతాయి. మీ చర్మాన్ని హైడ్రేట్ గా , ఆరోగ్యంగా ఉంచడానికి నీటిని పుష్కలంగా తాగండి. బాగా హైడ్రేటెడ్ గా ఉండే చర్మం దెబ్బతినే అవకాశం చాలా తక్కువ. ఈ చిట్కాలను పాటించడం వల్ల చర్మ క్యాన్సర్ రాకుండా జాగ్రత్త పడవచ్చు.