Oats Soup : ఓట్స్‌తో సూప్ తాగారా ఎప్పుడైనా? ఓట్స్ సూప్ తయారీ విధానం..

ఓట్స్(Oats) తో సూప్ కూడా చేసుకొని తాగొచ్చు.

  • Written By:
  • Publish Date - October 29, 2023 / 08:14 PM IST

చలికాలం(Winter) సాయంత్రం పూట వేడివేడిగా సూప్స్ తాగితే చాలా బాగుంటుంది. సూప్స్(Soup) బయట కొంచెం ఎక్కువ ధరకే అమ్ముతారు. అంత తేలిగ్గా కూడా దొరకవు. సూప్ తాగాలంటే రెస్టారెంట్ కి వెళ్లాల్సిందే. కానీ ఇంట్లోనే మనం సింపుల్ గా అనేక రకాల సూప్స్ చేసుకొని తాగొచ్చు. ఓట్స్(Oats) తో సూప్ కూడా చేసుకొని తాగొచ్చు.

ఓట్స్ సూప్ కి కావలసిన పదార్థాలు..

* ఓట్స్ రెండు స్పూన్లు
* ఉల్లిపాయ ఒకటి సన్నగా తరిగినది
* వెల్లుల్లి రెండు రెబ్బలు
* ఉప్పు రుచికి తగినంత
* మిరియాల పొడి కొద్దిగా
* నూనె కొద్దిగా
* కొత్తిమీర కొద్దిగా
* పాలు కొద్దిగా

ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని రెండు స్పూన్ల ఓట్స్ బాగా ఉడకనివ్వాలి. ఉడికిన తరువాత అందులో పాలు కలుపుకోవాలి. ఒక గిన్నె తీసుకొని దానిలో నూనె వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేగనివ్వాలి. అవి వేగిన తరువాత వాటిని ఓట్స్ ఉడికిన దానిలో కలపాలి. వాటితో పాటు మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలిపి కాసేపు మరగనివ్వాలి. అంతే వేడివేడిగా ఓట్స్ సూప్ రెడీ అయినట్టే. పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని తాగేయడమే.

Also Read : Vegan Eggs : వెజిటేరియన్స్ కోసం.. గుడ్డులందు ఈ గుడ్డు వేరయా !