Eye Exercises: కంటి చూపును పెంచే ఏడు వ్యాయామాలు.. అవేంటంటే?

ప్రస్తుత రోజుల్లో చిన్నపిల్లల నుంచి ముసలి వారి వరకు చాలామంది కళ్ళు సరిగ్గా కనిపించక కళ్ళజోడు ను

  • Written By:
  • Updated On - November 17, 2022 / 10:50 AM IST

ప్రస్తుత రోజుల్లో చిన్నపిల్లల నుంచి ముసలి వారి వరకు చాలామంది కళ్ళు సరిగ్గా కనిపించక కళ్ళజోడు ను ఉపయోగిస్తున్నారు. ఈ మధ్యకాలంలో అయితే ఈ మొబైల్ ఫోన్లో వాడకం వినియోగం తర్వాత చిన్న పిల్లలకి ఈ కళ్లద్దాలు వస్తున్నాయి. అయితే కొంతమంది పోయిన కంటిచూపుని తిరిగి పొందడానికి అనేక రకాల ఆరోగ్య చిట్కాలను పాటిస్తూ ఉంటారు. ఆహార పదార్థాల ద్వారా మాత్రమే కాకుండా వ్యాయామాల ద్వారా కూడా కంటి చూపును మెరుగుపరచుకోవచ్చట. కొన్ని రకాల వ్యాయామాలు చేయడం వల్ల కళ్ళు జోడు అవసరం ఉండదు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మొదట కంటిలోని నల్లగుడ్డును ప్రతిరోజు పది సార్లు గడియారం లాగా నిదానంగా తిప్పుతూ ఉండాలి. ఇలా ప్రతిరోజు చేయాలి. అయితే గడియారంలో ముళ్ళు ఎటువైపు తిరుగుతుందో దానికి వ్యతిరేక దిశలో కంటిలో నల్ల గుడ్డును తిప్పాలి. అలాగే నల్లగుడ్డు ని పైకి కిందికి కుడి పక్కకు, ఎడమ పక్కకు ఇలా పదిసార్లు నిదానంగా చేయాలి. ఇలా చేయడం వల్ల అది మీ కండరాలను బలంగా మారుస్తుంది. అలాగే 10 సెకండ్ల పాటు కళ్ళను వేగంగా మూసి తెరవాలి. ఈ విధంగా చేయడం వల్ల కళ్ళు క్లీన్ అవుతాయి. అలాగే కంటిలో ఉండే నీరు తాజాగా రిలీజ్ అవుతుంది.

దాంతో మీరు కంటిలో ఐ డ్రాప్స్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. అలాగే బొటనవేలును ముక్కుపై ఉంచి వీలైనంత దూరంగా జరపాలి. బొటనవేలు దూరం జరుపుతున్నప్పుడు మీ కళ్ళు కేవలం బొటనవేలును మాత్రమే చూడాలి. వీలును పూర్తిగా దూరం చేరిన తర్వాత కళ్ళ ఫోకస్ మార్చాలి. ఈ విధంగా పది సార్లు చేయడం వల్ల కళ్ళ ఫోకస్ పెరుగుతుంది. అదేవిధంగా కనుబొమ్మల కింద ఆరు సార్లు, కళ్లకు రెండు వైపులా ఐదుసార్లు, కళ్ళ కింద ఉండే ఎముకపై ఆరుసార్లు. రెండు చేతులతో మెల్లగా అడ్డుకోవాలి. ఈ విధంగా రోజు ఒత్తిడి చేయడం వల్ల కంటి చూపు మెరుగవుతుంది. అదేవిధంగా అరచేతులను ఒకదానికి ఒకటి రుద్దుకొని నా చేతులను మెల్లగా మూసిన కళ్ళపై పెట్టుకోవాలి. ఒక అర నిమిషం పాటు అలా చేసిన తర్వాత నిదానంగా కళ్ళు తెరవాలి. ప్రతి రోజు రెండుసార్లు ఇలా చేయడం వల్ల కళ్ళకండరాలకు విశ్రాంతి లభిస్తుంది. అయితే ఇప్పుడు చెప్పిన ఈ వ్యాయామాలు వల్ల కళ్లజోడును పూర్తిగా వాడే అవసరం కాకుండా కొంతమేర తగ్గుతుంది.