Site icon HashtagU Telugu

Blackheads: బొప్పాయితో ఈ విధంగా చేస్తే చాలు బ్లాక్ హెడ్స్ మాయం అవ్వాల్సిందే?

Mixcollage 04 Feb 2024 12 29 Pm 8375

Mixcollage 04 Feb 2024 12 29 Pm 8375

చాలామంది అమ్మాయిలు ఎదుర్కొనే సమస్యల్లో బ్లాక్‌ హెడ్స్‌ సమస్య కూడా ఒకటి. ఎక్కువగా ముక్కు, గడ్డం దగ్గర, ఛాతీ భాగాలపై బ్లాక్‌హెడ్స్‌ వస్తూ ఉంటాయి. కాలుష్యం, ఒత్తిడి వంటి కారణాల వల్ల బ్లాక్‌హెడ్స్‌ ఏర్పడుతుంటాయి. అయితే ఈ బ్లాక్ హెడ్స్ ని తగ్గించుకోవడానికి చాలా మంది ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. బ్యూటీ ప్రోడక్ట్ లను ఉపయోగించడంతోపాటు బ్యూటీ పార్లర్ల చుట్టూ కూడా తిరుగుతూ ఉంటారు.కాగా బ్లాక్‌హెడ్స్‌ను తొలగించడానికి కొన్ని సహాజమైన మార్గాలు సహాయపడతాయి. ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లోనే దొరికే వాటితోనే ఈ బ్లాక్ హెడ్స్ సమస్యను తగ్గించుకోవచ్చు.

మరి బ్లాక్ హెడ్స్ సమస్య తగ్గిపోవాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇందుకోసం ముల్తాని మట్టి కమల పండు తొక్కపొడి, రోజు వాటర్ మూడు కలిపి మిశ్రమంలో తయారుచేసి బ్లాక్ హెడ్స్ ఉన్నచోట స్క్రబ్ చేయాలి. ఆ తర్వాత ఐదు నుంచి పది నిమిషాల పాటు ఆరనిచ్చి చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల ఆ బ్లాక్ హెడ్స్ సమస్య నుంచి నెమ్మదిగా బయటపడవచ్చు. అలాగే ఇవి చర్మాన్ని కాంతివంతంగా చేస్తాయి, చర్మాన్ని మృదువుగా మారుస్తాయి.​ అర కప్పు చక్కెరలో రెండు చెంచాల బాదం నూనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి పట్టించి పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. వారంలో రెండుసార్లు ఇలా చేస్తే మంచి రిజల్ట్స్‌ ఉంటాయి.

తేనె, ఉప్పు, నిమ్మరసం మిక్స్‌ చేసి ముఖంపై స్క్రబ్‌ చేయాలి. దీన్ని 5 నిమిషాల పాటు ఆరనివ్వాలి. నిమ్మరసం ముఖంపై మురికిని తొలగిస్తే ఉప్పు స్క్రబ్‌లా పనిచేస్తుంది. తేనె చర్మానికి పోషణనిచ్చి మెరిపిస్తుంది. అయిదు నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. వారంలో రెండుమూడుసార్లు చేస్తే సరి. అలాగే బాగా పండిన బొప్పాయి తీసుకొని మెత్తని గుజ్జులా చేసుకోవాలి. అందులో పావుస్పూను శెనగపిండి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని బ్లాక్‌హెడ్స్ ఉన్నచోట అప్త్లె చేసి 20 నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత చల్లని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చొప్పున క్రమం తప్పకుండా చేయడం వల్ల బ్లాక్‌హెడ్స్‌ తొలగుతాయి. పచ్చిపాలు కొద్దిగా తీసుకొని వాటితో బ్లాక్‌హెడ్స్ ఉన్నచోట మృదువుగా మర్దన చేసుకోవాలి. తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఈవిధంగా రోజూ క్రమం తప్పకుండా చేస్తే బ్లాక్‌హెడ్స్ తగ్గుముఖం పడతాయి.

Exit mobile version