Site icon HashtagU Telugu

Blackheads removal tips: బ్లాక్ హెడ్స్ తగ్గాలంటే బొప్పాయితో ఇలా చేయాల్సిందే?

Blackheads Removal Tips

Blackheads Removal Tips

ఈ రోజుల్లో చాలామంది స్త్రీ పురుషులు బ్లాక్‌ హెడ్స్‌ సమస్యతో బాధపడుతున్నారు. ఎక్కువ శాతం ఈ బ్లాక్ హెడ్స్ ముక్కు భాగంలోనే వస్తూ ఉంటాయి. అలాగే గడ్డం, ఛాతి భాగంలో కూడా ఈ బ్లాక్ హెడ్స్ వస్తూ ఉంటాయి. ఇవి ఏర్పడడానికి గల కారణం కాలుష్యం, ఒత్తిడి. అయితే బ్లాక్ హెడ్స్ ని దూరం చేసుకోవడానికి చాలా మంది ట్రీట్మెంట్స్‌ తీసుకుంటారు, క్లినిక్‌లకు, సెలూన్‌లకు వెళ్తుంటారు. కానీ అవేమి అవసరం లేకుండా బ్లాక్‌హెడ్స్‌ను తొలగించడానికి కొన్ని సహాజమైన మార్గాలు సహాయపడతాయి. మరి ఆ హోమ్ రెమెడీస్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ముల్తానీ మట్టి, కమల తొక్క పొడిని రోజ్‌ వాటర్‌తో కలిపి మిశ్రమంలా చేసి ఆ మిశ్రమాన్ని బ్లాక్ హెడ్స్ ఉన్నచోట్ల అప్లై చేసి ఐదు నుంచి 10 నిమిషాల పాటు ఆరనిచ్చి ఆ తర్వాత చల్లటి నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే బ్లాక్‌హెడ్స్‌ మాయం అవుతాయి. ఇవి చర్మాన్ని కాంతివంతంగా చేస్తాయి, చర్మాన్ని మృదువుగా మారుస్తాయి.​

అదేవిధంగా అర కప్పు చక్కెరలో రెండు చెంచాల బాదం నూనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని బ్లాక్‌ హెడ్స్‌ కి పట్టించి పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. వారంలో రెండుసార్లు ఇలా చేస్తే మంచి రిజల్ట్స్‌ కనిపిస్తాయి. తేనె, ఉప్పు, నిమ్మరసం మిక్స్‌ చేసి ముఖంపై స్క్రబ్‌ చేయాలి. దీన్ని 5 నిమిషాల పాటు ఆరనివ్వాలి. నిమ్మరసం ముఖంపై మురికిని తొలగిస్తే ఉప్పు స్క్రబ్‌లా పనిచేస్తుంది. తేనె చర్మానికి పోషణనిచ్చి మెరిపిస్తుంది. అయిదు నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. వారంలో రెండు మూడు సార్లు చేస్తే సరిపోతుంది.

అలాగే బాగా పండిన బొప్పాయి తీసుకొని మెత్తని గుజ్జులా చేసుకోవాలి. అందులో పావు స్పూన్ శెనగపిండి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని బ్లాక్‌హెడ్స్ ఉన్నచోట అప్త్లె చేసి 20 నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత చల్లని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వల్ల బ్లాక్‌హెడ్స్‌ తొలగుతాయి. పచ్చిపాలు కొద్దిగా తీసుకొని వాటితో బ్లాక్‌హెడ్స్ ఉన్నచోట మృదువుగా మర్దన చేసుకోవాలి. తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఈవిధంగా రోజూ క్రమం తప్పకుండా చేస్తే బ్లాక్‌హెడ్స్ తగ్గుముఖం పడతాయి.