మామూలుగా స్త్రీ పురుషులు చాలామంది మెడ పై నలుపుదనం సమస్యతో బాధపడుతూ ఉంటారు. అబ్బాయిల సంగతి పక్కన పెడితే అమ్మాయిలు మెడ పై ఉన్న నలుపు తొలగించుకోవడానికి అనేక రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ని ఉపయోగిస్తూ ఉంటారు. హోమ్ రెమెడీస్ ని కూడా పాటిస్తూ ఉంటారు. అయినప్పటికీ ఫలితం లేదని బాధపడుతూ ఉంటారు. అయితే మాములుగా ఎండలు, కాలుష్యం, హార్మోన్ల మార్పుల కారణంగా మెడ నల్లగా మారుతుంది. ఊబకాయం, ఇన్సులిన్ నిరోధకత కూడా మెడ నల్లగా మారే అవకాశం ఉంది. మెడ నల్లగా మారితే చూడటానికి అందవిహీనంగా ఉంటుంది. మెడపై నలుపును ఎలా దూరం చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఓట్స్.. ఓట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా లభిస్తాయి. ఇవి చర్మాన్ని శుభ్రపరచడంతో పాటు మాయిశ్చరైజ్ చేయడానికి సహాయపడతాయి. ఓట్స్ డార్క్ నెక్ స్కిన్‌ను లైట్ చేయడానికి ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి. మీరు డార్క్ నెక్‌తో ఇబ్బంది పడుతుంటే ఓట్స్ గ్రైండ్ చేసి, దీనిలో కొద్దిగా టమాటా పేస్ట్ మీక్స్ చేయండి. దీన్ని పేస్ట్‌లా చేసి మెదడుకు అప్లై చేయాలి. ఆపై 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేయాలి.
నారింజ తొక్కలు… నారింజ తొక్కలో చర్మాన్ని తెల్లగా మార్చే గుణాలు ఉంటాయి. నారింజ తొక్కల్లోని యాంటీ ఆక్సిడెంట్స్, మెడ నల్లబడటానికి కారణం అయ్యే టైరోసిన్ సమ్మేళనానికి వ్యతిరేకంగా పోరాడతాయి. నొరింజ తొక్కల పొడిలో పాలు లేదా ఆరెంజ్ జ్యూస్ వేసి, పేస్ట్‌లా తయారు చేసుకోండి. మీరు ఈ పేస్ట్‌ను మెడకు అప్లై చేసి10 నుంచి 15 నిమిషాల పాటు ఆరనిచ్చి తర్వాత గోరువెచ్చని నీళ్లతో మెడను శుభ్రం చేసుకోవాలి.
నిమ్మరసం.. నిమ్మకాయలో యాంటీ ఆక్సిడెంట్స్ మెండుగా ఉంటాయి. ఇవి చర్మాన్ని కాంతివంతంగా మార్చడానికి సహాయపడతాయి. నిమ్మకాయలోని యాంటీ ఆక్సిడెంట్స్ టైరోసిన్‌కు వ్యతిరేకంగా పోరాడతాయి. కాబట్టి నిమ్మరసానికి సమాన పరిమాణంలో రోజ్ వాటర్ మిక్స్ చేసి మెడకు అప్లై చేసి 15 నుంచి 20 నిమిషాల పాటు ఆరనిచ్చి ఆ తర్వాత చల్లటి నీళ్లతో శుభ్రం చేసుకోవడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది.
కలబంద.. కలబంద చర్మానికి అనేక ప్రయోజనాలు అందిస్తుంది. దీనికి చర్మాన్ని కాంతివంతంగా మార్చే సామర్థ్యం ఉంటుంది. మెలనిన్ ఉత్పత్తికి కారణం అయ్యే ఎంజైమ్ చర్యను నిరోధిస్తుంది. మీ మెడ నల్లగా ఉంటే కలబంద గుజ్జును మెడకు అప్లై చేసి.. సున్నితంగా మసాజ్ చేయండి. ఆ తర్వాత 10 నుంచి 15 నిమిషాల పాటు ఆరనిచ్చి తర్వాత చల్లటి నీళ్లతో మెడను శుభ్రం చేసుకోవాలి.