Site icon HashtagU Telugu

Elbow Darkness: మోచేతులు నల్లగా ఉన్నాయా.. అయితే ఈ సింపుల్ చిట్కాలు పాటించాల్సిందే?

Mixcollage 06 Dec 2023 05 46 Pm 4619

Mixcollage 06 Dec 2023 05 46 Pm 4619

మామూలుగా మనిషి ఎంత అందంగా ఉన్నా కూడా మోకాళ్లు, మో చేతులు నల్లగా ఉండడం అన్నది కామన్. అయితే చెయ్యి మొత్తం తెల్లగా కనిపించి మోచేతులు మాత్రం నల్లగా కనిపిస్తే చూడడానికి అంద విహీనంగా కనిపిస్తూ ఉంటుంది. చాలామంది మోచేతులపై ఉన్న నలుపును పోగొట్టుకోవడానికి రకరకాల క్రీములు ఉపయోగిస్తూ ఉంటారు. వాటి వల్ల ఫలితం లేక ఫీల్ అవుతూ ఉంటారు. అయితే మరి మోచేతులు తెల్లగా అవ్వాలి అంటే కొన్ని రకాల చిట్కాలను పాటించాల్సిందే. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మోచేతులు, కాలిమడమల నలుపు దనం పోయి, మృదువుగా మారాలంటే పెసరపిండిలో కొంచెం నిమ్మరసం, బేబీ ఆయిల్‌ వేసి మిక్స్‌ చేయాలి.

ఈ మిశ్రమాన్ని ప్రభావితం ప్రాంతంలో అప్లై చేయాలి. కొద్దిగా ఆరిన తర్వాత చేతులు నీటితో తడుపుతూ మృదువుగా రబ్‌ చేయాలి. ఇలా చేస్తే చర్మానికి తేమ అందుతుంది. డెడ్‌సెల్స్‌ తొలగి మోచేతులు మృదువుగా, తెల్లగా మారతాయి. పెరుగు చర్మానికి తేమను అందిస్తుంది. మోచేతులు, కాలి మడమ లను మృదువుగా మారుస్తుంది. ఒక గిన్నెలో రెండు స్పూన్ల పెరుగు, కొద్దిగా వైట్‌ వెనిగర్‌ తీసుకుని మిక్స్‌ చేసుకోవాలి. దీన్ని ప్రభావిత ప్రాంతంపై అప్లై చేసుకోవాలి. పావుగంట పాటు ఆరనిచ్చి గోరు వెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి. టవల్‌ తో పొడిగా తుడుచుకొని మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే నలుపు దనం తగ్గుతుంది.

రెండు టీ స్పూన్ల పెరుగులో కొద్దిగా బాదం పొడి కలిపి నలుపుగా ఉన్న చోట రాసి, రుద్ది, శుభ్రపరచాలి. పాల మీగడలో చిటికెడు పసుపు రాసి, నలుపుగా ఉన్న చోటరాసి, రుద్ది, శుభ్రపరచాలి.​ రోజూ స్నానానికి ముందు మోచేతులకు, కాలిమడమలకు నిమ్మరసం రాసి, పది నిమిషాలు ఉంచాలి. నిమ్మ మంచి క్లెన్సర్‌గా పనిచేసి మృతకణాలను సమర్థంగా తొలగిస్తుంది. నిమ్మరసం చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. నలుపు రంగును విరుస్తుంది. ఇలా రోజూ చేస్తే.. నలుపు తగ్గుముఖం పడుతుంది.అలాగే టీ స్పూన్‌ కొబ్బరి నూనె, అర టీ స్పూన్‌ నిమ్మరసం కలిపి మోచేతులు, మోకాళ్లపై రాసి వేడి టవల్‌తో తుడవాలి. ఇలా తరచుగా చేస్తూ ఉంటే. మృదువుగా మారతాయి. అదేవిధంగా నిమ్మ చెక్కను ఉప్పులో ముంచి రుద్దినా మోచేతులపై ఉన్న నలుపును తగ్గించుకోవచ్చు.​