Site icon HashtagU Telugu

Dark Elbows: మోచేతులు నల్లగా ఉన్నాయా.. అయితే ఈ చిట్కాలు పాటించాల్సిందే?

Dark Elbows

Dark Elbows

ఈ రోజుల్లో స్త్రీలు చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో మోచేతుల నలుపు సమస్య కూడా ఒకటి. స్త్రీ పురుషులు ఈ సమస్యతో బాధపడుతున్నప్పటికీ ఎక్కువగా ఈ విషయంపై స్త్రీలు ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. అందమైన చేతులకు, కాళ్ల కోసం మానిక్యూర్‌, పెడిక్యూర్‌ చేయించుకుంటూ ఉంటారు. కానీ, కొంతమంది మోచేతులు, మోకాళ్లు, కాలిమడమలను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. దీని వల్ల అవి నల్లగా, గరుకుగా మారతాయి. ఆలస్యంగా ఈ సమస్యను గుర్తించి ఏవేవో క్రీమ్‌లు రాస్తూ ఉంటారు. మన ఇంట్లో దొరికే సహజమైన పదార్థాలతోనే ఈ సమస్యను పరిష్కరించవచ్చు. మరి ఆ హోమ్ రెమిడీస్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

నిమ్మరసం క్లెన్సర్‌గా పనిచేస్తుంది. ఇది మన శరీరంపై పేరుకున్న మృతకణాలను సులభంగా తొలగిస్తుంది. నిమ్మ చెక్కను తీసుకొని మోచేతులపై నలుపుగా ఉన్నచోట కాసేపు రుద్ది, ఆ తర్వాత గోరువెచ్చటి నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా రెండు రోజులకు ఒకసారి చేస్తే మంచి రిజల్ట్స్‌ ఉంటాయి. పెరుగు మోచేతుల నల్లధనాన్ని పోగొడుతుంది. ఇందులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మం రంగును కాంతివంతం చేయడానికి సహాయపడుతుంది. ఇది చర్మాన్ని తేమగా ఉంచడంలో సహాయపడుతుంది. ఒక గిన్నెలో రెండు స్పూన్ల పెరుగు, కొద్దిగా వైట్‌ వెనిగర్‌ తీసుకొని మిక్స్‌ చేసి, దీన్ని మోచేతులకు, మోకాళ్లకు రాసుకోవాలి.

ఆరిన తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి. టవల్‌తో పొడిగా తుడుచుకొని మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే నలుపు పోతుంది. శనగపిండి.. మోచేతులు, మోకాళ్ల నలుపు పొగొడుతుంది. ముందుగా మోచేతులను శుభ్రం చేసుకోవాలి. శనగపిండి తీసుకుని దానిలో పెరుగు వేసి పేస్ట్‌లా తయారు చేసుకొని, ఈ పేస్ట్‌ను మోచేతులు, మోకాళ్లు, కాలిమడమలకు అప్పై చేయాలి. ఇది ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. ఇలా రోజూ చేస్తే నలుపు పోతుంది. అదేవిధంగా కలబంద గుజ్జును నల్లగా ఉన్న మోచేతులకు, మోకాళ్లకు రాసుకోవాలి. ఆ తర్వాత ఇరవై నిమిషాల పాటు ఆరనిచ్చి, గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. అలాగే మోచేతులు, మోకాళ్ల నలుపు తొలగించడానికి చక్కెర ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. మీరు ఒక స్పూన్‌ ఆలివ్‌ ఆయిల్‌ తీసుకుని కొద్దిగా చక్కెర వేసి మిక్స్‌ చేయిండి. దీని ఎఫెక్టెడ్‌ ప్రాంతాల్లో అప్లై చేయాలి. ఐదు నుంచి పదిహేను నిమిషాల పాటు స్క్రబ్‌ చేయాలి. ఆ తర్వాత నీటితో శుభ్రం చేసుకొని, పంచదార మృత కణాలను తొలగిస్తుంది. ఆలివ్‌ నూనె చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. రోజూ ఇలా చేస్తే నలుపు పోతుంది.