Frizzy hair: జుట్టు చిక్కు పడకుండా ఉండాలి అంటే ఈ ప్యాక్స్ ను ట్రై చేయాల్సిందే?/

మామూలుగా మనకు జుట్టు చిక్కులు పడడం అన్నది కామన్. కొందరికి అయితే పదేపదే జుట్టు చిక్కు పడుతూ ఉంటుంది. ఈ చిక్కు కారణంగా అధికంగా హెయిర్ ఫాల్

  • Written By:
  • Updated On - February 14, 2024 / 08:49 PM IST

మామూలుగా మనకు జుట్టు చిక్కులు పడడం అన్నది కామన్. కొందరికి అయితే పదేపదే జుట్టు చిక్కు పడుతూ ఉంటుంది. ఈ చిక్కు కారణంగా అధికంగా హెయిర్ ఫాల్ అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి. జుట్టు చిక్కులు పడుతుంటే దాన్ని ఆకృతి పాడవుతుంది, చూడటానికి బాగోదు. చిక్కులు ఎక్కువగా పడటం వల్ల మనం పదే పదే దువ్వుతూ ఉంటాం. దాంతో జుట్టు చిట్లిపోవడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అయితే జుట్టు చిట్లిపోకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా కొన్ని హెయిర్ ప్యాక్స్ ట్రై చేయాల్సిందే అంటున్నారు నిపుణులు. మరి ఆ ప్యాక్స్ ఏంటి అన్న విషయానికొస్తే..

ఒక పచ్చి గుడ్డు, 1/4 కప్పు బాదం నూనెను మిక్స్‌ చేసి, ఆ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేయండి. దీన్ని 40 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీళ్లతో తలస్నానం చేయాలి. దీన్ని వారానికి ఒకసారి అప్లై చేస్తే మంచి రిజల్ట్స్‌ ఉంటాయి. బాదం నూనె ఎమోలియెంట్‌గా పనిచేస్తుంది. గుడ్డులోని ప్రొటీన్‌ జుట్టు డ్యామేజ్‌ను రిపేర్‌ చేస్తుంది. జుట్టును చిక్కులు పడకుండా చేస్తుంది.​ ఒక కప్పు కొబ్బరి నూనెలో 10 విటమిన్‌ ఇ ఆయిల్‌ క్యాప్‌స్యూల్స్‌ పిండి మిక్స్‌ చేయండి. దీన్ని ఎయిర్‌ టైట్‌ కంటైనర్‌లో స్టోర్‌ చేయండి. ఈ ఆయిల్‌ను రాత్రిపూట తలకు, జుట్టుకు అప్లై చేసి ఉదయం గోరువెచ్చని నీళ్లతో తలస్నానం చేయండి.

వారానికి రెండు సార్లు ఇలా చేస్తే.. చిక్కుల సమస్య దూరం అవ్వడంతో పాటు.. హెయిర్‌ ఫాల్‌ సమస్య దూరం అవుతుంది. విటమిన్‌ ఇ ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడుతుంది, జుట్టు దెబ్బతినకుండా రక్షిస్తుంది. కొబ్బరి నూనె మీ జుట్టుకు తేమను అందిస్తుంది. అలాగే బాగా పండిన అరటిపండు గుజ్జులో, రెండు టీస్పూన్ల తేనె, 1/3 కప్పు తేనె వేసి మిక్స్‌ చేయండి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేసి 20 – 25 నిమిషాల పాటు ఆరనివ్వండి. ఆ తర్వాత మైల్డ్‌ షాంపూతో తలస్నానం చేయాలి. ఈ మాస్క్‌ను వారానికి ఒకసారి వేస్తే మంచి రిజల్ట్స్‌ ఉంటాయి. అరటిపండు హెయిర్‌కు కండీషనర్‌లా ఉపయోగపడుతుంది. ఈ మాస్క్‌ జుట్టు చిక్కులను దూరం చేసి, మృదువుగా, దృఢంగా ఉంచుతాయి.

మూడు టేబుల్‌ స్పూన్ల పెరుగులో ఒక టేబుల్‌ స్పూన్ల తేనె మిక్స్‌ చేసి పేస్ట్‌లా చేయండి. ఈ పేస్ట్‌ను తలకు, జుట్టుకు అప్లై చేసి 20 నిమిషాల పాటు ఆరనివ్వండి. పెరుగు జుట్టు కండీనర్‌లా పనిచేస్తుంది. తేనె జుట్టు తేమను నిలుపుకోవడంలో సహాయపడుతుంది, మృదువుగా ఉంచుతుంది. కలబంద గుజ్జును తీసుకుని జుట్టుకు, తలకు అప్లై చేయండి. దీన్ని 20 నుంచి 30 నిమిషాల పాటు ఆరనిచ్చి మైల్డ్‌ షాంపూతో తలస్నానం చేయండి. వారానికి రెండు సార్లు ఈ ప్యాక్‌ వేసుకుంటే.. జుట్టు చిక్కులు పడదు. కలబంద జట్టుకు తేమనందిస్తుంది. జుట్టు మృదువుగా, మెరిసేలా చేస్తుంది.