Site icon HashtagU Telugu

Foot Tan: ఈ సింపుల్ చిట్కాలను ఫాలో అయితే చాలు నల్లటి పాదాలు తెల్లగా మారాల్సిందే?

Mixcollage 05 Feb 2024 08 40 Pm 415

Mixcollage 05 Feb 2024 08 40 Pm 415

మామూలుగా అమ్మాయిలు అందం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా ముఖం చేతులు మెడ భాగాలలో చాలా కేర్ తీసుకుంటూ ఉంటారు. అయితే వీటి విషయంలో తీసుకున్నంత కేర్ పాదాల విషయంలో తీసుకోరు. అందుకే చాలామంది పాదాలు నల్లగా, నిర్జీవంగా మారతాయి. అసలే వేసవికాలం ఎండకు డైరెక్ట్‌గా ఎక్స్‌ఫోజ్‌ అయ్యే భాగాలలో పాదాలు కూడా ఒకటి. సమ్మర్‌లో ఇంకా ఎక్కువగా టాన్‌ పేరుకుపోయి నల్లగా మారతాయి. పాదాల టాన్‌ తొలగి ప్రకాశవంతంగా మెరవాలంటే కొన్ని న్యాచురల్‌ టిప్స్‌ ను ఉపయోగించాల్సిందే.​ కాగా పెరుగులో ఉండే లాక్టిక్‌ యాసిడ్‌ సున్నితమైన ఎక్స్‌ఫోలియేటర్‌గా పనిచేస్తుంది. దీనిలో ట్యాన్‌ను తొలగించే గుణాలు కూడా ఉన్నాయి.

శెనగపిండిలోని పోషకాలు చర్మంపై పేరుకున్న డెడ్‌ సెల్స్‌, వ్యర్థాలను తొలగిస్తాయి. మీరు టాన్‌ ప్యాక్‌ తయారు చేసుకోవడానికి 1 టేబుల్‌ స్పూన్ శనగపిండి, 3 టేబుల్‌ స్పూన్ల పెరుగు తీసుకుని పేస్ట్‌లా తయారు చేయండి. మీ పాదాలపై ఈ ప్యాక్‌ అప్లై చేసి 30 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత మీ చేతితో సున్నితంగా స్క్రబ్‌ చేసి గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేయాలి. ఆ తర్వతా మాయిశ్చరైజర్‌ అప్లై చేయాలి . ఇలా వారానికి రెండు సార్లు ఇలా చేస్తే కాళ్లపై టాన్‌ తొలగి ప్రకాశవంతంగా మారతాయి. పెరుగులో ఉండే లాక్టిక్‌ యాసిడ్‌ సున్నితమైన ఎక్స్‌ఫోలియేటర్‌గా పనిచేస్తుంది. దీనిలో ట్యాన్‌ను తొలగించే గుణాలు కూడా ఉన్నాయి.

శెనగపిండిలోని పోషకాలు చర్మంపై పేరుకున్న డెడ్‌ సెల్స్‌, వ్యర్థాలను తొలగిస్తాయి. మీరు టాన్‌ ప్యాక్‌ తయారు చేసుకోవడానికి 1 టేబుల్‌ స్పూన్ శనగపిండి, 3 టేబుల్‌ స్పూన్ల పెరుగు తీసుకుని పేస్ట్‌లా తయారు చేయండి. మీ పాదాలపై ఈ ప్యాక్‌ అప్లై చేసి 30 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత మీ చేతితో సున్నితంగా స్క్రబ్‌ చేసి గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేయాలి. ఆ తర్వతా మాయిశ్చరైజర్‌ అప్లై చేయాలి ఇలా వారానికి రెండు సార్లు ఇలా చేస్తే కాళ్లపై టాన్‌ తొలగి ప్రకాశవంతంగా మారతాయి. అదేవిధంగా కాఫీ పొడి చర్మానికి మంచి స్క్రబ్‌గా పనిచేస్తుంది. ఇది చర్మంపై పేరుకున్న డెడ్‌ సెల్స్‌ను తొలగిస్తుంది. కాఫీలో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి చర్మాన్ని కాంతివంతం చేస్తాయి. కొబ్బరి నూనె చర్మాన్ని తేమనందించి, మెరుపు ఇస్తుంది. రెండు టేబుల్‌ స్పూన్ల కాఫీ పొడిలో, రెండు టేబుల్‌ స్పూన్ల కొబ్బరి నూనె వేసి పేస్ట్‌లా చేయాలి. ఈ మిక్స్‌ను పాదాలకు అప్లై చేసి 10 నుంచి 15 నిమిషాల పాటు ఆరనివ్వండి. ఆ తర్వాత చేతివేళ్లతో సున్నితంగా స్క్రబ్‌ చేయాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేయండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే పాదాలపై పేరుకున్న టాన్‌ సులభంగా తొలగుతుంది.