Site icon HashtagU Telugu

Foot Tan: పాదాలు నల్లగా మారాయా.. అయితే ఈ చిట్కాలు పాటించాల్సిందే?

Foot Tan

Foot Tan

చాలామంది స్త్రీ పురుషులు అందానికి ప్రాముఖ్యత ఇస్తారు కానీ ఎక్కువగా ముఖం చేతులు మెడ భాగాలకే కేర్ తీసుకుంటూ ఉంటారు. వాటి మీద ఉన్న కేర్ పాదాల విషయంలో అంతగా ఉండదని చెప్పవచ్చు. అందుకే చాలామంది అందంగా ఉన్నప్పటికీ వారి కాళ్లు నల్లగా పొడిగా కాళ్ళు శుభ్రం చేసుకున్న కూడా కడుక్కోనట్టుగానే ఉంటాయి. మరి ముఖ్యంగా సమ్మర్‌లో ఇంకా ఎక్కువగా టాన్‌ పేరుకుపోయి నల్లగా మారతాయి. పాదాల టాన్‌ తొలగి ప్రకాశవంతంగా మెరవాలంటే కొన్ని న్యాచురల్‌ టిప్స్‌ సహాయపడతాయి.​ మరి ఆ టిప్స్ ఏంటి అన్న విషయానికి వస్తే…

శనగపిండి, పెరుగు… పెరుగులో ఉండే లాక్టిక్‌ యాసిడ్‌ సున్నితమైన ఎక్స్‌ఫోలియేటర్‌గా పనిచేస్తుంది. దీనిలో ట్యాన్‌ను తొలగించే గుణాలు కూడా ఉన్నాయి. శెనగపిండి లోని పోషకాలు చర్మంపై పేరుకున్న డెడ్‌ సెల్స్‌, వ్యర్థాలను తొలగిస్తాయి. మీరు టాన్‌ ప్యాక్‌ తయారు చేసుకోవడానికి 1 టేబుల్‌ స్పూన్ శనగపిండి, 3 టేబుల్‌ స్పూన్ల పెరుగు తీసుకుని పేస్ట్‌లా తయారు చేయండి. మీ పాదాలపై ఈ ప్యాక్‌ అప్లై చేసి 30 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత మీ చేతితో సున్నితంగా స్క్రబ్‌ చేసి గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేయాలి. ఆ తర్వతా మాయిశ్చరైజర్‌ అప్లై చేయండి. ఇలా వారానికి రెండు సార్లు ఇలా చేస్తే కాళ్లపై టాన్‌ తొలగి ప్రకాశవంతంగా మారతాయి.

బంగాళదుంప, నిమ్మరసం.. బ్లాక్‌హెడ్స్‌, నల్లటి మచ్చలకు చికిత్స చేయడంలో బంగాళదుంపు ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. బంగాళదుంపలో కాటెకోలేస్‌ అనే ఎంజైమ్‌ ఉంటుంది ఇది నల్లమచ్చలను దూరం చేస్తుంది. ఇది నల్లగా మారిన పాదాలకు చక్కని ఛాయను అందిస్తుంది. నిమ్మరసంలో విటమిన్‌ సి అధికంగా ఉంటుంది.. నిస్తేజంగా, నల్లగా మారిన పాదాల డెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కిన్‌ సెల్స్‌ను తొలగించడానికి న్యాచురల్‌ అస్ట్రింజెంట్‌గా పనిచేస్తుంది. ఇందుకోసం బంగాళాదుంప పేస్ట్‌, 1 నిమ్మకాయ రసాన్ని మిక్స్‌ చేస్తి పేస్ట్‌ చేయండి. దీన్ని పాదాలకు అప్లై చేసి 20- 30 నిమిషాలు ఆరనిచ్చి, చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

కాఫీ, కొబ్బరి నూనె.. కాఫీ పొడి చర్మానికి మంచి స్క్రబ్‌గా పనిచేస్తుంది. ఇది చర్మంపై పేరుకున్న డెడ్‌ సెల్స్‌ను తొలగిస్తుంది. కాఫీలో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి చర్మాన్ని కాంతివంతం చేస్తాయి. రెండు టేబుల్‌ స్పూన్ల కాఫీ పొడిలో, రెండు టేబుల్‌ స్పూన్ల కొబ్బరి నూనె వేసి పేస్ట్‌లా చేయండి. ఈ మిక్స్‌ను పాదాలకు అప్లై చేసి 10 నుంచి 15 నిమిషాల పాటు ఆరనిచ్చి తర్వాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేయండి.

చక్కెర, నిమ్మరసం… నిమ్మరసంలోని సిట్రిక్‌ యాసిడ్‌కు యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్‌ గుణాలు మెండుగా ఉంటాయి. ఈ గుణాలు చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి. చక్కెర ఎక్స్‌ఫోలియేటర్‌గా పనిచేస్తుంది. మూడు టేబుల్‌ స్పూన్ల చక్కెరలో, 1 స్పూన్‌ నిమ్మరసం వేసి మిక్స్‌ చేయండి. దీన్ని పాదాలకు అప్లై చేయండి. దీన్ని సుమారు 5 నుంచి 7 నిమిషాల పాటు వృత్తాకారంలో స్క్రబ్‌ చేయండి. ఆ తర్వాత 10 నిమిషాల పాటు ఆరనిచ్చి నీటితో శుభ్రం చేయాలి.