చర్మంపై ఓపెన్ ఫోర్స్ తగ్గాలంటే ఓట్స్ తో ఈ విధంగా చేయాల్సిందే?

మామూలుగా అమ్మాయిలు చర్మం ప్రకాశవంతంగా మృదువుగా అందంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. మృదువైన మెరిసే చర్మం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు a

  • Written By:
  • Publish Date - February 3, 2024 / 12:00 PM IST

మామూలుగా అమ్మాయిలు చర్మం ప్రకాశవంతంగా మృదువుగా అందంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. మృదువైన మెరిసే చర్మం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా డబ్బులు వేలకు వేలు ఖర్చు చేస్తూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో చాలా మంది అందానికి సంబంధించిన అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నారు. అటువంటి వాటిలో ఓపెన్ పోర్స్ కూడా ఒకటి. సెబమ్‌ ఎక్కువగా ఉత్పత్తి కావడం, జన్యుపరమైన కారణాలు, వృద్ధాప్యం వంటి కారణాల వల్ల చర్మం ఉపరితలంపై ఓపెనింగ్స్‌ పెద్దవి కావచ్చు. ఓపెన్‌ పోర్స్‌ కారణంగా మొటిమలు, వైట్‌హెట్స్‌, బ్లాక్‌హెడ్స్‌, బ్రెక్‌అవుట్స్‌ వంటి సమస్యలు వస్తాయి.

ఓపెన్‌ పోర్స్‌ను పూర్తిగా తగ్గించలేనప్పటికీ వీటిని కవర్‌ చేయడానికి కొన్ని ఎఫెక్టివ్‌ హోమ్ రెమిడీస్‌ ఉపయోగించవచ్చు.​ ఇంతకీ ఆ రెమెడీస్ ఏంటి అన్న విషయానికి వస్తే.. ముల్తానీ మట్టి ఓపెన్‌ పోర్స్‌ను కవర్‌ చేయడానికి ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది చికాకు, చర్మం ఎర్రబడటం వంటి సమస్యల నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. ఇందులోని సహజ శీతలీకరణ గుణాలు చర్మాన్ని శాంత పరుస్తాయి, చర్మంలోని అధిక నూనెను గ్రహిస్తుంది, పేరుకున్న మలినాలను తొలగిస్తుంది. మీరు ఓపెన్‌ పోర్స్‌ కారణంగా ఇబ్బంది పడుతుంటే ముల్తానీ పట్టిలో రోజ్‌ వాటర్‌ కలిపి మృదువైన పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి ప్యాక్‌లా అప్లై చేసుకోండి.

దీన్ని 20 నిమిషాల పాటు ఆరనిచ్చి, చల్లని నీళ్లతో శుభ్రం చేసుకోండి. రోజ్ వాటర్ అందుబాటులో లేకుంటే, పెరుగు, టమాటా రసం కూడా ఉపయోగించవచ్చు. వారానికి రెండు సార్లు ఇలా చేస్తే.. ఓపెన్ పోర్స్‌ కవర్‌ అవుతాయి.​ అలాగే శెనగ పిండి ఎప్పటినుంచో సౌందర్య ప్రయోజనాలకు ఉపయోగిస్తున్నారు. ఇది అద్భుతమైన ఎక్స్‌ఫోలియంట్, క్లెన్సర్‌గా పని చేస్తుంది. చర్మం నుంచి అదనపు నూనెను సమర్థవంతంగా తొలగిస్తుంది. శనగపిండిలో పెరుగు, ఆలివ్ నూనెతో మిక్స్‌ చేసి ఆ పేస్ట్‌ను ముఖానికి పట్టించి, వృత్తాకారంలో సున్నితంగా మసాజ్ చేయాలి. ఆ తర్వాత 20 నిమిషాల పాటు ఆరనిచ్చి, ఆపై నీటితో శుభ్రం చేసుకోవాలి. ఫేస్ ప్యాక్‌ని తీసివేసిన తర్వాత మీ ముఖంపై కొన్ని ఐస్ క్యూబ్‌లను సున్నితంగా రుద్దాలి. ఓపెన్‌ పోర్స్‌ తగ్గించడానికి ఐస్‌ క్యూబ్స్‌ ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి. శుభ్రమైన క్లాత్‌ తీసుకుని దానిలో ఐస్‌ క్యూబ్‌ వేసి చుట్టాలి. వీటితో 15-30 సెకన్ల పాటు సున్నితంగా రుద్దాలి. చల్లని ఉష్ణోగ్రత రక్త నాళాలను సంకోచించడానికి హాయపడతాయి, చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. తద్వారా మీ రంధ్రాలు చిన్నవిగా కనిపిస్తాయి. ఇది చర్మానికి రిఫ్రెష్, టోనింగ్ ప్రభావాన్ని అందిస్తుంది. ఓట్స్‌ చర్మపు చికాకు, దురదను తగ్గిస్తుంది. ఇవి ఓపెన్‌ పోర్స్‌ను తగ్గించడానికి సహాయపడతాయి. ఓట్స్‌ను మెత్తగా పొడి చేసి, దానిలో నీళ్లు, తేనె వేసి పేస్ట్‌లా కలపాలి. ఈ పేస్ట్‌ను మీ ముఖానికి ప్యాక్‌లా అప్లై చేయాలి. అరగంట తర్వాత, గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత మాయిశ్చరైజర్‌ అప్లై చేసుకోవాలి.