Beauty Tips: ముఖం తల తల మెరిసిపోవాలంటే శనగపిండిలో ఇవి కలిపి రాయాల్సిందే?

చాలామంది ముఖం నల్లగా ఉంది అని దిగులు చెందుతూ ఉంటారు. ఇక ముఖాన్ని తెల్లగా మార్చుకోవడం కోసం ఎన్నో రకాల సోపులు ఫేస్ క్రీమ్లు, బ్యూటీ ప్రోడక్ట్

Published By: HashtagU Telugu Desk
Mixcollage 03 Jan 2024 09 02 Pm 4409

Mixcollage 03 Jan 2024 09 02 Pm 4409

చాలామంది ముఖం నల్లగా ఉంది అని దిగులు చెందుతూ ఉంటారు. ఇక ముఖాన్ని తెల్లగా మార్చుకోవడం కోసం ఎన్నో రకాల సోపులు ఫేస్ క్రీమ్లు, బ్యూటీ ప్రోడక్ట్ ను ఉపయోగించడంతోపాటు అప్పుడప్పుడు బ్యూటీ పార్లర్ కు కూడా వెళ్తూ ఉంటారు. ఇంకొందరు వంటింటి చిట్కాలను కూడా ఫాలో అవుతూ ఉంటారు. ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ముఖం కాంతివంతంగా మారలేదని దిగులు చెందుతూ ఉంటారు. ఇక మీదట మీరు అలా బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మేము చెప్పబోయే చిట్కాలు పాటిస్తే చాలు ముఖం కాంతివంతంగా మారడం ఖాయం. మరి అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఇందుకోసం ఒక గిన్నెలో స్పూన్ పంచదార, ఒక స్పూన్ రాగి పిండి, స్పూన్ శనగ పిండి, స్పూన్ కొబ్బరి నూనె వేసుకోవాలి. వీటన్నింటిని బాగా కలిపి ఇందులో కొద్దిగా నీటిని వేసి కలిపి ఆ మిశ్రమాన్ని పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ముఖాన్ని నీటితో శుభ్రంగా కడుక్కొని ఈ మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేసుకోవాలి. ఒక ఐదు నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేయాలి. తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్ర పరుచుకోవాలి. ఇందులో వాడిన పంచదార ముఖంపై పేరుకు పోయిన వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ను తొలగించి మూఖాన్ని కాంతి వంతంగా తయారు చేస్తుంది. అలాగే రాగి పిండిలో ఉన్న అమైనో ఆమ్లాలు చర్మంపై కొల్లాజెన్ ఏర్పడడానికి సహాయ పడుతుంది.

లైసిన్ వంటి ముఖ్యమై అమైనో ఆమ్లాలు ఉండటం వల్ల మృత చర్మ కణజాలాన్ని డలించడం ద్వారా తగ్గిస్తుంది. ముఖంపై రాగి పండిని తరచూ రాయం వల్ల చర్మంపై వృద్ధఆప్య ప్రభావాలను తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే శనగ పిండి ముఖంపై పేరుకు పోయిన టాన్ ను తొలగిస్తుంది. మొటిమలకు కారణం అయ్యే జిడ్డును కూడా వదిలిస్తుంది. యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కల్గి ఉండటం వల్ల మొటిమలు రాకుండా అడ్డుకుంటుంది.

  Last Updated: 03 Jan 2024, 09:03 PM IST