Site icon HashtagU Telugu

Lipstick: లిప్ స్టిక్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారా.. అయితే జాగ్రత్త?

Lipstick

Lipstick

మామూలుగా అమ్మాయిలు పెదవులకు లిబ్బం లిప్ స్టిక్ అంటూ రకరకాల అప్లై చేస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా లిప్ స్టిక్ ని ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. రకరకాల బ్రాండ్లను ఉపయోగిస్తూ ఉంటారు. పెదవులు ఎర్రగా షైనింగ్ గా కనిపించడం కోసం ఏవేవో ఉపయోగించడంతో పాటు ఎక్కువ మోతాదులో కూడా వినియోగిస్తూ ఉంటారు. లిప్ స్టిక్ ని వాడే మోతాదు, సంఖ్యని బట్టి అనారోగ్య సమస్యల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. చాలామంది ఈ స్త్రీలకు తెలియని విషయం ఏమిటంటే లిప్ స్టిక్ లు ఎక్కువగా ఉపయోగించడం వల్ల అవి ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను తెచ్చిపెడతాయి. కొన్ని రకాల లిప్ స్టిక్ లో 10 పిపిఎం సీసం ఉంటుంది. ఇంత స్థాయిలో సీసం ఉంటే అది చాలా ప్రమాదకరం.

ఇది మూత్రపిండాలు, ఎముకలు, క్యాన్సర్ వంటి వ్యాధులకి కారణం అవుతుంది. మరికొందరికి గైనిక్ సమస్యలు వస్తాయి. అలాగే ముఖ్యంగా గర్భిణీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా చాలామంది ఆడవాళ్ళు నాసిరకం లిప్ స్టిక్ ని వాడుతుంటారు. దీనిలో ఎక్కువగా బ్యాడ్ కెమికల్స్ ఉపయోగిస్తారు. దీనివల్ల నాడి వ్యవస్థపై ప్రభావం పడుతుంది. అది క్రమంగా మెదడుపై కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. తద్వారా మెదడు ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది. అలాగే హార్మోన్ల అసమతుల ఏర్పడి తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పునరుత్పత్తి వ్యవస్థపై కూడా నాసిరకం లిప్ స్టిక్ ప్రభావం చూపుతుంది. శరీరం ఎదుగుదలపై కూడా దాని ప్రభావం ఉంటుంది. లిప్ స్టిక్ లోని రసాయన మూలకాలు చర్మ సమస్యలను కలిగిస్తాయి.

దీనివల్ల ఎనర్జీ వచ్చే అవకాశం ఎక్కువ. మీది సున్నితమైన చర్మం అయినట్లయితే వీలైనంత వరకు లిప్ స్టిక్ ని ఉపయోగించకుండా ఉండడం మంచిది. ఇందులో ఉండే పాలిథిలిన్ మీ నాడీ వ్యవస్థకు హాని కలిగిస్తుంది. కాబట్టి లిప్ స్టిక్ కొనేటప్పుడు అందులో ఎంత పాలిథిలిన్ ఉందో గమనించడం మంచిది. ఎక్కువ పాలిథిలిన్ ఉన్నట్లయితే ఆ లిప్ స్టిక్ కొనుగోలు చేయకపోవడమే మంచిది. తప్పనిసరి పరిస్థితుల్లో లిప్ స్టిక్ వేసుకోవాల్సి వస్తే ముందుగా పెదాలకి పెట్రోలియం జెల్లీ అప్లై చేసి తర్వాత లిప్స్టిక్ ని అప్లై చేయాలి. ఎందుకంటే పెట్రోలియం జెల్లీ మీ పెదాలను రక్షించడంలో సహాయపడుతుంది.

Exit mobile version