Site icon HashtagU Telugu

Papaya Seeds: బొప్పాయి గింజలతో అటువంటి సమస్యలకు చెక్..?

Papaya Benefits

Papaya Benefits

Papaya Seeds: బొప్పాయి.. దీనినే కొన్ని ప్రదేశాలలో పరంగికాయి లేదా పరంగి పండు అని కూడా పిలుస్తూ ఉంటారు. బొప్పాయి పండు వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ బొప్పాయి పండుని ఇష్టపడి తింటూ ఉంటారు. అయితే ఈ బొప్పాయి పండుని కేవలం ఆరోగ్య ప్రయోజనాలకు మాత్రమే కాకుండా వంటల్లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే చర్మ సౌందర్యానికి కూడా బొప్పాయి పండు ఎంతో బాగా పనిచేస్తుంది.

అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే బొప్పాయి పండుతో మాత్రమే కాకుండా బొప్పాయి గింజల్లో కూడా అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. మరి బొప్పాయి గింజలు ఆరోగ్యానికి ఏ విధంగా సహాయ పడతాయి. వాటిని తినడం వల్ల ఎటువంటి సమస్యలు దూరం అవుతాయో ఇప్పుడు మనం తెలుసుకున్నాం.. బొప్పాయి గింజలలో పాలీఫెనాల్స్, ఫ్లేవలోయిడ్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి శరీరంలో ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా సంక్రమణ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

అలాగే బొప్పాయి గింజలు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్థాయి. బొప్పాయి గింజల్లో కొవ్వు ఆమ్లాలు ఉండి అవి రక్తం లోని చెడు కొలెస్ట్రాల్‌ ను తగ్గిస్తుంది. బొప్పాయి గింజలను తినడం వల్ల గుండెపోటు, కరోనరీ ఆర్టరీ వ్యాధి, ట్రిపుల్ నాళాల వ్యాధి వంటి గుండె జబ్బుల సమస్యలను నివారించవచ్చు. అలాగే బొప్పాయి గింజలను తినడం వల్ల బరువును నియంత్రించవచ్చు. ఈ గింజల్లో ఉండే ఫైబర్ జీర్ణ క్రియను మెరుగుపరచడంలో బాగా చేస్తుంది. ఇక జీర్ణ వ్యవస్థ బాగుంటే స్థూలదు కాయానికి దారి తీయకుండా పెరుగుతున్న బరువును కూడా అదుపులో ఉంచుకోవచ్చు..