Food Allergy: ఈ ఆహార పదార్థాలను తింటే ఫుడ్ అలర్జీ వస్తుందా? నిపుణులు చెబుతున్న విషయాలివే?

సాధారణంగా ఫుడ్ అలర్జీ వచ్చింది అంటే చాలు ఇంట్లో పెద్దవారు ఆ బయట ఫుడ్ తినడం వల్లే వస్తుంది అని మందలిస్తూ ఉంటారు. అయితే కేవలం బయట ఫుడ్డు వల్లే కాకుండా కొన్నిసార్లు ఇంట్లో వండిన ఫుడ్ ఐటమ్స్ వల్ల కూడా ఫుడ్ ఎలర్జీ వస్తుందట

Published By: HashtagU Telugu Desk
Food Allergy

Food Allergy

సాధారణంగా ఫుడ్ అలర్జీ వచ్చింది అంటే చాలు ఇంట్లో పెద్దవారు ఆ బయట ఫుడ్ తినడం వల్లే వస్తుంది అని మందలిస్తూ ఉంటారు. అయితే కేవలం బయట ఫుడ్డు వల్లే కాకుండా కొన్నిసార్లు ఇంట్లో వండిన ఫుడ్ ఐటమ్స్ వల్ల కూడా ఫుడ్ ఎలర్జీ వస్తుందట. మనం ఇంట్లో కాని లేదా బయట కానీ కొన్ని రకాల ఆహార పదార్థాలు తిన్నప్పుడు ఫుడ్ ఎలర్జీ సమస్య వస్తుందట. మరి ఆ ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇప్పుడైనా పాలు తాగిన తర్వాత ఇబ్బందిగా అనిపిస్తే అది డైరీ ప్రొడక్ట్స్ అయిన పాలు తాగడం వల్ల అలా ఇబ్బందిగా అనిపిస్తుంది.
అయితే మూడు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు ఇలాంటి అలర్జీలు వస్తాయి. అంతేకాకుండా పొడి కలిపి తయారుచేసిన పాలు తాగడం వల్ల కూడా అలర్జీలు వస్తాయి. అలాగే గుడ్డు తినడం వల్ల కూడా కొన్నిసార్లు ఎనర్జీ వస్తుందట. అంతే కాకుండా ఒక అధ్యయనం ప్రకారం 68 శాతం మంది పిల్లలు గుడ్ల ద్వారా అలర్జీని కలిగి ఉంటారట. గుడ్డు తిన్నప్పుడు అలర్జీ అనిపించడంతోపాటు కడుపు నొప్పి, అతిసారం, చర్మంపై దద్దుర్లు, శ్వాసకోశ సమస్యలు కూడా వస్తాయట. అలాగే చాలా మందికి పల్లీలు లేదా శనగ విత్తనాలు పడవు.
వేరుశనగ అలర్జీ లక్షణాలు చర్మం దద్దుర్లు, ఎరుపు, దురదగా మారడం, గొంతులో మంటలా అలాగే వికారం, వాంతులు ఉంటాయి. అలాగే సోయా ఆధారిత ప్రొడక్ట్స్ వల్ల కూడా ఈ ఎనర్జీ సమస్య వస్తుంది. ఈ సోయా అలర్జీ లక్షణాలు విషయానికి వస్తే దురద, ముక్కు కారడం, దద్దుర్లు, ఆస్తమా వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాగే గోధుమలలోని ప్రోటీన్లు కూడా అలర్జీకి కారణం అవ్వవచ్చు. గోధుమల అలర్జీ లక్షణాలు దద్దుర్లు వాంతులు వాపు, ఉదరకు హర సమస్యలు వంటివి వస్తాయి. పైన చెప్పిన ఆహార పదార్థాలు తిన్న తర్వాత ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చిన వెంటనే డాక్టర్ ని సంప్రదించడం మంచిది.
  Last Updated: 22 Sep 2022, 11:07 PM IST