Site icon HashtagU Telugu

Amnesia: మతిమరుపు రావడానికి అసలు కారణాలు ఇవే!

Amensia

Amensia

సాధారణంగా వయసు మీద పడే కొద్ది మతిమరుపు అన్నది వస్తూ ఉంటుంది. పైస మీద పడే కొద్ది అనగా ముసలి వాళ్ళు అయ్యేకొద్దీ చెప్పిన విషయాలను తొందరగా మరిచిపోతూ ఉంటారు. అయితే ఇదివరకు కేవలం ముసలి వాళ్లకు మాత్రమే మతిమరుపు సమస్య ఉండేది. కానీ రాను రాను ఈ మతిమరుపు సమస్య పిల్లలకు అలాగే యువతకు కూడా కనిపిస్తోంది. అయితే ఈ మతిమరుపు అనేది అనేక రకాల కారణాల వల్ల వస్తుంది. ఇది మతిమరుపు రావడానికి గల కారణాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కంటినిండా నిద్ర పోకపోతే అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి.

తద్వారా అది మెమొరీ పవర్ పై ప్రభావాన్ని చూపుతుంది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు అలాగే కంటి నిండా నిద్రలేని వారు చెప్పిన విషయాలను మర్చిపోతూ ఉంటారు. ఎందుకంటే నిద్రలోనే విషయాలను గుర్తుంచుకునే బ్రెయిన్ కణాలు బలంగా మారుతాయి. అందుకే చెప్పిన విషయాలను గుర్తుంచుకోవాలి అన్న ఏదైనా మాటలు గుర్తుంచుకోవాలి అన్న కూడా రాత్రి సమయంలో ఎనిమిది గంటలకు కచ్చితంగా నిద్రపోవాలి. దీంతోపాటు సరైన పోషకాహారం తింటూ వ్యాయామం చేయాలి.

అలాగే టీలు, కాఫీలు,ఆల్కహాల్, స్మోకింగ్ వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. అలాగే డయాబెటిస్ పేషెంట్లు కూడా మతిమరుపు సమస్యతో బాధపడుతూ ఉంటారు. అయితే డయాబెటిస్ పేషెంట్లలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉన్నంతవరకు ఎటువంటి మతిమరుపు సమస్యలు రావు. అని చక్కెర శాతం ఎక్కువగా ఉంటే మాత్రం బ్రెయిన్ లో ఉన్న సూక్ష్మ రక్తనాళాలు దెబ్బతిని మతిమరుపు సమస్య వస్తుంది. అలాగే వయసు మీద పడుతున్న కొద్ది అనేక రకాల ఇబ్బందుల వల్ల ఈ మతిమరుపు సమస్య మొదలవుతుంది. అనగా అధిక రక్తపోటు, శారీరక శ్రమ, హార్ట్ ప్రాబ్లమ్స్, తీసుకునే ఆహారం వల్ల కూడా మతిమరుపు సమస్య వచ్చే అవకాశం ఉంది అని చెబుతున్నారు నిపుణులు. పక్షవాతం అన్నది బ్రెయిన్ లో సగభాగానికి రక్తం అందకపోతే వస్తుంది. దీంతో బ్రెయిన్ ఒక కణజాలం దెబ్బతిని విషయాలను గుర్తుంచుకునే సామర్థ్యం తగ్గిపోతుంది. అలాగే పక్షపాతం వారిని పడితే మాట తీరు సరిగా ఉండదు. అలాగే అతిగా స్మోకింగ్ చేయడం వల్ల కూడా మతిమరుపు సమస్య వస్తుందట. ప్రతిరోజు స్మోక్ చేసేవారు విషయాలను ఎక్కువగా గుర్తుంచుకోలేరట. దీంతో బ్రెయిన్ లో రక్తనాళాలు దెబ్బతిని మతిమరుపు మాత్రమే కాదు పక్షపాతం బారిన పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి.

Exit mobile version