Hair Tips: కేవలం 5 నిమిషాల్లోనే మీ తెల్ల జుట్టు నల్లగా మారాలంటే ఇలా చేయాల్సిందే.!

ప్రస్తుత రోజుల్లో చాలామంది జుట్టుకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. జుట్టుకు సంబంధించిన ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతు

Published By: HashtagU Telugu Desk
Mixcollage 04 Mar 2024 09 58 Pm 1043

Mixcollage 04 Mar 2024 09 58 Pm 1043

ప్రస్తుత రోజుల్లో చాలామంది జుట్టుకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. జుట్టుకు సంబంధించిన ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నారు. వాటిలో తెల్ల జుట్టు సమస్య కూడా ఒకటీ.. చిన్న వయసు వారి నుంచి ఈ తెల్ల జుట్టు సమస్య మొదలవుతుంది. తెల్లజుట్టు నల్లగా మార్చుకోవడం కోసం రకరకాల హెయిర్ కలర్లు ఉపయోగించడంతో పాటు, ఎన్నో రకాల హోమ్ రెమెడీస్ ని కూడా ఫాలో అవుతూ ఉంటారు. అలాగే ఏవో ఇంగ్లీష్ మందులు వాడుతూ ఇంకా సమస్యలను ఎక్కువ చేసుకుంటూ ఉంటాం. ఈ సమస్యలకు చెక్ పెట్టాలంటే బంగాళదుంపతో ఈ రెమిడి ట్రై చేయాల్సిందే.

ముందుగా బంగాళదుంపల్ని తీసుకొని వాటి తొక్కల్ని తీసుకొని నీటిలో మరిగించి ఆ నీటిని వడకట్టి పక్కన పెట్టుకోవాలి. షాంపుతో తలస్నానం చేసిన తర్వాత జుట్టుని శుభ్రంగా తుడిచి ఈ బంగాళదుంప తొక్కల నీటిని తలకి అప్లై చేయాలి. ఇలా అప్లై చేసిన తర్వాత అరగంట ఉంచుకోవాలి. తర్వాత చల్లటి నీటితో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండుసార్లు చేసినట్లయితే మీ జుట్టు నల్లగా మారుతుంది. తెల్ల జుట్టు అధికంగా ఉంటే ఎక్కువసార్లు అప్లై చేయాలి.

ఈ రెమిడి ఏ వయసు వారైనా వాడుకోవచ్చు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.. తెల్ల జుట్టు నల్లగా మార్చడానికి ఎన్నో పరిహారాలు ఉంటాయి. కలమంద దీనికి మంచి మందులా సహాయపడుతుంది. తెల్ల జుట్టు నల్లగా చేయడానికి గుంటగలరాకు కూడా అలాగే కరివేపాకు, మునగాకు కూడా బాగా ఉపయోగపడతాయి.

  Last Updated: 04 Mar 2024, 09:59 PM IST