Site icon HashtagU Telugu

Senaga Vadalu: చలికాలంలో వేడివేడి శెనగల వడలు.. ఇంట్లోనే చేసుకోండిలా?

Mixcollage 07 Dec 2023 08 31 Pm 5707

Mixcollage 07 Dec 2023 08 31 Pm 5707

మామూలుగా మనం ఈవినింగ్ స్నాక్ ఐటమ్ గా రకరకాల వడలను చేసుకొని తింటూ ఉంటాం. ఆకుకూర వడలు, శనగపిండి వడలు,పకోడా మిరపకాయ, బజ్జీలు, బంగాళదుంప బజ్జీలు,ఇలా రకరకాల వడలు వేసుకొని తింటూ ఉంటాం. అయితే చాలా వరకు మనం శనగపిండితో తయారుచేసిన వడలు తింటూ ఉంటాం. కానీ డైరెక్టుగా శనగలతో చేసిన వడలు ఎప్పుడైనా తిన్నారా. ఎప్పుడు తినకపోతే ఇంట్లోనే శనగల వడలు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

శెనగల వడలకు కావాల్సిన పదార్థాలు:

1కప్పు మొలకలు వచ్చిన శెనగలు
1 /4కప్పు మైదా పిండి
1 /4కప్పు ఉల్లి పాయ తరుగు
1 స్పూను పచ్చి మిరపకాయ ముక్కలు
1 స్పూను అల్లం తరుగు
1టీ స్పూను కారం పొడి
1 స్పూను కొత్తిమీర ఆకులు
1 స్పూను పుదీనా ఆకులు
4 కరివేపాకు రెబ్బలు
ఉప్పు తగినంత
నూనె తగినంత

శెనగలతో వడలు తయారీ విధానం:

ముందుగా మొలకలు వచ్చిన శెనగలు తీసుకొని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. అందులో తరిగిన ఉల్లిపాయలు, అల్లం, పచ్చి మిర్చి ముక్కలు వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమానికి కొత్తిమీర, పుదీనా ఆకులు, కరివేపాకు రెబ్బలు, ఉప్పు , కారం వేసి కలపాలి. తర్వాత బాండీ లో నూనె వేసి సన్నటి సెగ మీద ఉంచాలి. నూనె మరిగాక,పప్పు రుబ్బిన మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలు గా చేతికి తీసుకుని వడలుగా వేసుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే శనగల వడలు రెడీ.