Site icon HashtagU Telugu

Semiya Uthappam: వెరైటీగా ఉండే సేమియా ఊతప్పం.. ఇలా చేస్తే ఇష్టంగా తినేయాల్సిందే?

Mixcollage 29 Dec 2023 06 16 Pm 9445

Mixcollage 29 Dec 2023 06 16 Pm 9445

ఊతప్పం.. అంటే ఇష్టపడని వారు ఉండరు. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటూ ఉంటారు. ఇంట్లో సంగతి పక్కన పెడితే హోటల్ కు రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు చాలామంది ఊతప్పలు ఎక్కువగా ఆర్డర్ చేయడం మనం చూసే ఉంటాం గమనించి ఉంటాం. అయితే ఎప్పుడైనా వెరైటీగా ఉండే సేమియా ఊతప్పం తిన్నారా. తినకపోతే ఈ రెసిపీ ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

సేమియా ఊతప్పంకి కావాల్సిన పదార్ధాలు:

పెరుగు – ఒక కప్పు
రవ్వ – ఒక కప్పు
సేమియా – ఒక కప్పు
వంట సోడా – అర కప్పు
అల్లం – చిన్న ముక్క
పచ్చిమిర్చి – మూడు
నూనె – పావు కప్పు
ఉప్పు – రుచికి సరిపడా
నీరు – 1 1/4 కప్పులు
నూనె – అర టేబుల్ స్పూన్
ఉల్లిపాయ తరుగు – పావు కప్పు
జీలకర్ర – అర టీ స్పూన్

సేమియా ఊతప్పం తయారీ విధానం:

ముందుగా అల్లం, పచ్చిమిర్చిని మెత్తగా దంచుకోవాలి. తర్వాత పెరుగులో, వంట సోడా కలిపి 30 సెకన్లు పక్కన పెట్టుకోవాలి. అలా కలపడం వలన పెరుగు పొంగుతుంది. పొంగిన పెరుగులో, రవ్వ, సేమియా, ఉప్పు, నీరు, దంచిన అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసి బాగా కలిపి కనీసం 30 నిమిషాల వరకు అలానే వుంచాలి. నూనె వేసి, ఉల్లిపాయ, జీలకర్ర, కరివేపాకు వేసి ఒక నిమిషం వేపి, పులిసిన పిండిలో కలిపేయాలి. ఆపై పెనంని వేడి చేసి, గరిటితో పిండిని పెనం మీద పోసి నెమ్మదిగా తడుతూ వుంటే పిండి కాస్త స్ప్రెడ్ అవుతుంది. పిండి అంచుల వెంట నూనె వేసి మీడియం ఫ్లేమ్ మీద ఎర్రగా కాల్చుకోవాలి. తరువాత తిరగేసి మళ్ళీ ఇంకో 2 నిమిషాలు కాల్చి వేడి వేడిగా నచ్చిన పచ్చడితో సర్వ్ చేసుకోవడమే.