Site icon HashtagU Telugu

Semiya Cutlets: పిల్లలు ఎంతగానో ఇష్టపడే సేమియా కట్లెట్.. ట్రై చేయండిలా?

Semiya Cutlets

Semiya Cutlets

మామూలుగా మనం ఆలు కట్లెట్, వెజిటేబుల్ కట్లెట్ అంటూ రకరకాల కట్లెట్స్ తింటూ ఉంటాము. అయితే ఎప్పుడైనా కాస్త వెరైటీగా ఉండే సేమియా కట్లెట్స్ ఉన్నారా. తినడానికి ఈ రెసిపీ కాస్త వెరైటీగా ఉన్నా, ఒక్కసారి ట్రై చేస్తే చాలు పిల్లలు ఎంతో ఇష్టపడి తినేస్తారు. మరి ఈ రెసిపీని ఏ విధంగా తయారు చేసుకోవాలి? అందుకు ఏ ఏ పదార్థాలు కావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

సేమియా కట్లెట్స్ కావలసిన పదార్థాలు:-

సేమియా – ఒక కప్పు
బంగాళాదుంప – ఒకటి
క్యారట్ – ఒకటి
ఆకుపచ్చ బఠాణీ – మూడు స్పూన్లు
ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు
మైదా పిండి – అర కప్పు
అల్లంముక్కలు తరిగినవి – ఒక స్పూను
పచ్చిమిర్చి తరిగినవి – అర స్పూను
జీలకర్ర – అర స్పూను
గరం మసాలా – ఒక స్పూను
పసుపు – చిటికెడు
కొత్తిమీర తరుగు – ఒక స్పూను
ఉప్పు – తగినంత
నూనె – తగినంత

సేమియా కట్లెట్స్ తయారీ విధానం :

ఇందుకోసం ముందుగా సేమియాను ఒక గిన్నెలో వేసి, ఒక గ్లాస్ నీళ్లు పోసి ఉడికించుకోవాలి, నీళ్లను వడకట్టి సేమియా పక్కన పెట్టుకోవాలి. బంగాళాదుంపను, క్యారట్ ను కూడా ఉడికించుకోవాలి. తర్వాత ఉడికిన ఆలు క్యారట్ లను, మాష్ చేసి, బఠాణి గింజలను, ఉల్లిపాయ ముక్కలను, అల్లం , పచ్చిమిర్చి ముక్కలను కలిపాలి. ఈ మిశ్రమంలో ఉడికించిన సేమియాను, మైదా పిండిని కలిపాలి. ఆపై తగినంత ఉప్పు, పసుపు, జీలకర్ర, గరం మసాలా కూడా వేసి పిండి గట్టిగా కలుపుకోవాలి. స్టవ్ మీద బాండీ ఉంచి, నూనె పోసి, ఈ పిండిని చిన్న చిన్న ఉండలు గా చేసుకుని, కట్లెట్స్ గా చేత్తో వత్తుతూ ఒక్కొక్కటిగా నూనెలో వేసి వేయించాలి. అన్ని కట్లెట్స్ ని గోధుమ రంగులోకి వేయించాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే సేమియా కట్లెట్స్ రెడీ.