Site icon HashtagU Telugu

White Teeth: పళ్ళు తల తల మెరవాలంటే.. ఇలా చేయాల్సిందే?

Don't Brush Your Teeth

Don't Brush Your Teeth

మాములుగా పళ్ళు పసుపుపచ్చగా ఉంటే చాలామంది ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. నలుగురితో మాట్లాడాలి అన్న నలుగురిలోకి కలిసి వెళ్లాలి అన్న కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. అయితే పల్లపై ఉన్న గారను పసుపుదనాన్ని తొలగించుకోవడానికి రకరకాల టూత్ పేస్టులను మార్చడంతో పాటు రకరకాల హోమ్ రెమెడీస్ ని కూడా ఫాలో అవుతూ ఉంటారు. పళ్ళు తెల్లగా చేసే ట్రీట్మెంట్‌లో బ్లీచ్, హైడ్రోజెన్ పెరాక్సైడ్ వంటి కెమికల్స్ మాత్రమే వాడతారు. ఎనామిల్, గమ్స్ కి అతి తక్కువ హాని జరిగేలా రేడియేషన్ తో కలిపి వాడతారు. ఈ ప్రొసీజర్‌కి ముందు పళ్ళని క్లీన్ చేయడం, పాలిష్ చేయడం వంటివి రికమెండ్ చేస్తారు.

ఎందుకంటే దీని వల్ల ప్లేక్‌ని రిమూవ్ చేయవచ్చు. పళ్ళ సర్ఫేస్‌ని స్మూత్‌గా చేయడం కోసం బ్లీచ్ కూడా చేస్తారు. అప్పుడే ఫలితాలు బాగుంటాయి. అయితే మరి పళ్ళు తెల్లగా, శుభ్రంగా ఉండాలంటే ఏం చేయాలో ఎటువంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఆహారానికి రంగునిచ్చే పదార్ధాలని వాడడం మానేయండి. నీటిలో ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల వచ్చే మచ్చలని పోగొట్టడానికి టీత్ వైటెనింగ్‌తో కలిపి వినీర్స్‌తో ట్రీట్ చేస్తారు. టీ, కాఫీ, రెడ్ వైన్, పళ్ళ రంగు మార్చే పండ్లు తీసుకోవడం తగ్గించండి. అయితే, ఇలాంటి వాటి వల్ల రంగు మారిన పళ్ళని కేవలం టీత్ వైటెనింగ్ ప్రొసీజర్స్‌తోనే ట్రీట్ చేయవచ్చు. అలాగే డెంటల్ క్లినిక్‌లో బ్లీచ్ చేయించుకోవడం.

ఈ ప్రక్రియలో డెంటిస్ట్ మీ పళ్ళ మీద టీత్ వైటెనింగ్ జెల్ అప్లై చేసి లేజర్ కానీ, స్పెషల్ లైట్ కానీ యూజ్ చేసి పళ్ళని 6-8 షేడ్స్ తెల్లగా చేస్తారు. అయితే, ఇదంతా ఒక్క రోజే అయిపోదు. రెగ్యులర్‌గా డెంటిస్ట్‌ని విజిట్ చేయవలసి ఉంటుంది. కానీ ఎనామిల్, గమ్స్ చెక్కు చెదరకుండా ఉండాలంటే మాత్రం ఇదే బెస్ట్ పద్ధతి. మరో పద్దతి ఏమిటంటే ఇంట్లోనే బ్లీచ్ చేసుకోవడం. ఇందు కోసం మీ డెంటిస్ట్ మీకోసమే ఫ్యాబ్రికేట్ చేసిన డెంటల్ ట్రేస్‌ని ఇస్తారు. వీటిని మీరు టీత్ వైటెనింగ్ జెల్ అప్లై చేసిన తరువాత డెంటిస్ట్ సూచనల ప్రకారం ఇంట్లో ధరిస్తే మీ పళ్ళు 3-4 షేడ్స్ తెల్లగా అవుతాయి. వైటెనింగ్ టూత్పేస్ట్ వాడడం ఇంకొక పద్ధతి. రెగ్యులర్ టూత్ పేస్ట్ లో కనీసం 1450పీపీఎం ఫ్లోరైడ్ ఉంటుంది, కానీ వైటెనింగ్ టూత్ పేస్ట్‌లో హైడ్రోజెన్ పెరాక్సైడ్ కూడా ఉంటుంది, పళ్ళని తెల్లగా చేయడంలో ఇది ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అయితే, రెగ్యులర్ టూత్ పేస్ట్‌లో ఇది చాలా తక్కువగా ఉంటుంది. ఈ వైటెనింగ్ టూత్ పేస్ట్ ని రోజుకి రెండు సార్లు యూజ్ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.