Acne: మొటిమలంటే భయమా? ఇలా నివారించుకోవచ్చు.

చక్కెర (Sugar) ఉండే పదార్థాలు, కూల్‌డ్రింక్‌లు, వైట్‌ బ్రెడ్‌, బంగాళదుంప.. దూరంగా ఉండండి.

చక్కెర ఉండే పదార్థాలు, కూల్‌డ్రింక్‌లు, వైట్‌ బ్రెడ్‌, బంగాళదుంప.. దూరంగా ఉండండి. అన్నం ఒక్కపూటకే పరిమితం చేయండి. వీటిల్లోని కార్బోహైడ్రేట్లు శరీరంలో గ్లూకోజ్‌ స్థాయుల్ని ప్రభావితం చేస్తాయి. మొటిమలకీ (Acne) కారణమవుతాయి.

1. పాలు, పాలపదార్థాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ యాక్నే సమస్య ఉన్నవారికి వీటితో ఇబ్బందే. కాబట్టి, కొన్నిరోజులు వీటినీ పక్కన పెట్టేయండి. అసలే ఎండ పెరుగుతోంది. వేడిని తట్టుకోవడానికి మాత్రం పలుచని మజ్జిగ తీసుకోవచ్చు.

2. వ్యాయామం చేసేవారు ప్రొటీన్‌ పౌడర్లపై ఆధారపడుతుండటం సహజమే. ? ఇవీ మొటిమలకు దారితీసేవే. కాబట్టి, దూరం పెట్టాల్సిందే. అందానికీ, ఆరోగ్యానికీ దాల్చినచెక్క ఎంత మేలు చేస్తుందో చెప్పలేం. కానీ మొటిమలు (Acne) పలకరించొద్దంటే వేడుకల ముందు దీన్ని ఆహారంలో భాగం చేసుకోకపోవడమే మేలు. వీటితోపాటు ఎక్కువగా నీటిని, ద్రవరూప పదార్థాలనీ తీసుకోండి. చర్మానికి తగిన తేమ అందితే పొడిబారడం, నూనెలు అధికంగా విడుదలై యాక్నేకి దారితీసే సమస్యలకు చెక్‌ పెట్టేసినట్లే!

3. కాస్త ఖాళీ ఉన్నామంటే మనసు చిరుతిళ్లవైపు మళ్లుతుంది. అలాగని జంక్‌ ఫుడ్‌ని చూసి నోరు కట్టుకోలేకపోయారో.. పింపుల్‌ని ఆహ్వానించేసినట్టే. ఏదైనా తినాలనిపిస్తే నట్స్‌, పండు వంటివి ఎంచుకోండి.

Also Read:  Joe Biden: చైనాకు క్షమాపణ చెప్పే ఆలోచనే లేదు – జో బైడెన్