SBI New Rules : SBI ATM నుంచి 10వేల కంటే ఎక్కువ విత్ డ్రాకు ఓటీపీ మస్ట్!!

ఏటీఎం లావాదేవీలను మరింత సురక్షితం చేసేందుకు ఎస్‌బీఐ నిబంధనలను మార్చింది. కొత్త రూల్స్ తీసుకొచ్చింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Written By:
  • Publish Date - July 26, 2022 / 08:00 AM IST

ఏటీఎం లావాదేవీలను మరింత సురక్షితం చేసేందుకు ఎస్‌బీఐ నిబంధనలను మార్చింది. కొత్త రూల్స్ తీసుకొచ్చింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

కొత్త రూల్ ప్రకారం.. మీరు SBI ATM నుంచి రూ. 10,000 కంటే ఎక్కువ విత్‌డ్రా చేస్తే 4 అంకెల OTPని తప్పకుండా ఎంటర్ చేయాలి. కస్టమర్లు ఓటీపీ లేకుండా రూ.10వేలకు మించి నగదు తీసుకోలేరు. నగదు విత్‌ డ్రా సమయంలో ఖాతాదారుల ఫోన్‌కి ఓటీపీ వస్తుంది. ఇది ఎంటర్ చేసిన తర్వాతే ఏటీఎం  నుంచి నగదు తీసుకోగలుగుతారు. ఎస్‌బీఐ ఏటీఎంలో మీరు రూ.10,000 లోపు డబ్బులు డ్రా చేయాలంటే ఓటీపీ అవసరం లేదు. కానీ అంతకన్నా ఎక్కువ డ్రా చేయాలంటే ఓటీపీ తప్పనిసరి. సైబర్ మోసగాళ్ల నుంచి కస్టమర్లని రక్షించడానికి ఈ చర్య చేపట్టారు. “ఎస్‌బీఐ ఏటీఎంలల్లో లావాదేవీల కోసం మా ఓటీపీ బేస్డ్ క్యాష్ విత్‌డ్రాయల్ సిస్టమ్ మోసగాళ్లకు వ్యాక్సినేషన్ లాంటిది. ఇలాంటి మోసాల నుంచి మిమ్మల్ని రక్షించడం మా ప్రాధాన్యతల్లో మొదటి స్థానం ఉంటుంది” అని ఎస్‌బీఐ ఇటీవల ట్వీట్ చేసింది.

ఎస్‌బీఐలో ఓటీపీ తో విత్‌డ్రాయల్ ఇలా..

*  ముందుగా ఎస్‌బీఐ ఏటీఎంలో మీ డెబిట్ కార్డ్ స్వైప్ చేయాలి.

* ఆ తర్వాత మీరు డ్రా చేయాలనుకునే మొత్తాన్ని ఎంటర్ చేయాలి.

* మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.

* నాలుగు అంకెల ఓటీపీ ఎంటర్ చేసి నగదు విత్‌డ్రా చేయొచ్చు.

* ఈ ఓటీపీ కేవలం ఒక ట్రాన్సాక్షన్‌కు మాత్రమే వర్తిస్తుంది.

ఏటీఎం కార్డు లేకపోయినా నో ప్రాబ్లమ్..

మీ దగ్గర ఎస్‌బీఐ ఏటీఎం కార్డు లేకపోయినా డబ్బులు డ్రా చేయడం సాధ్యమే. ఎస్‌బీఐ చాలా కాలం క్రితమే ఈ టెక్నాలజీ కూడా తీసుకొచ్చింది. అయితే ఈ పద్ధతి ఉపయోగించకుండా ఇప్పటికీ ఎస్‌బీఐ ఏటీఎం కార్డుతో డబ్బులు డ్రా చేసేవారు ఉన్నారు. మీ ఏటీఎం కార్డు అస్సలు ఉపయోగించకుండా ఓటీపీ ద్వారా సులువుగా డబ్బులు డ్రా చేయొచ్చు. ఇందుకోసం మీరు యోనో యాప్‌లో రిజిస్టర్ చేయాలి. మరి ఏటీఎం కార్డు లేకుండా నగదు ఎలా విత్‌డ్రా చేయాలో తెలుసుకోండి.

* ముందుగా యోనో యాప్ ఓపెన్ చేసిన తర్వాత Request YONO cash పైన క్లిక్ చేయాలి.

*  మీకు ఎంత నగదు కావాలో ఎంటర్ చేయాలి.

*  ఆ తర్వాత 6 అంకెల పిన్ క్రియేట్ చేయాలి.

*  ఏటీఎంకు వెళ్లిన తర్వాత కార్డ్ లెస్ ట్రాన్సాక్షన్ ఆప్షన్ ఎంచుకోవాలి.

*  మీరు క్రియేట్ చేసిన 6 అంకెల రిఫరెన్స్ నెంబర్ ఎంటర్ చేయాలి.

*  ఆ తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు మరో పిన్ వస్తుంది.

* ఆ పిన్ కూడా ఏటీఎంలో ఎంటర్ చేసి నగదు డ్రా చేయొచ్చు.