Site icon HashtagU Telugu

Samantha & Sadhguru: సద్గురును సమంత అడిగిన ప్రశ్నలపై హాట్ డిబేట్..

Samantha Sadhguru

Samantha Sadhguru

గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో “మట్టిని రక్షించు” కార్యక్రమం ఇటీవల ఉత్సాహభరితంగా జరిగింది. ఈ కార్యక్రమం వేదికగా సద్గురు జగ్గీ వాసుదేవ్ ను సినీ నటి సమంత కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు అడిగారు. ఇప్పుడు వాటిపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది.

సమంత : ఒక వ్యక్తి ప్రస్తుతం ఎదుర్కొనే అన్యాయాలకు గత కర్మలను నిందించడం సరైందేనా ? మన జీవితంలో ఎంత భాగం గత కర్మల ఫలితంగా నిర్ధారితం అవుతుంది ?

సద్గురు : ఈ ప్రపంచం ఇంకా మీతో న్యాయంగా ఉండాలని మీరు భావిస్తున్నారా?

సమంత : అందుకే కదా .. నేను ఈ ప్రశ్న అడుగుతున్నది. నేను నా గత కర్మలను నిందించవచ్చా? అని అడుగుతున్నా..(నవ్వుతూ)

సద్గురు : ప్రపంచం మనతో న్యాయంగా నడుచుకోవాలని భావించడం అనేది స్కూల్ గర్ల్ క్వశ్చన్. “ప్రపంచం న్యాయంగా ఉండదని ఇప్పటికే మీకు తెలిసిపోయింది. ఎన్నడూ అది న్యాయంగా ఉండదు.”

సమంత : డబ్బు, పేరు కోసమే ఆధ్యాత్మికతను కొందరు అడ్డం పెట్టుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి కదా..

సద్గురు : కడుపు నిండితే మనిషికి అన్నీ కష్టాలే కనిపిస్తాయి. ఆకలితో ఉంటే.. కడుపు నింపుకోవడమే పెద్ద సమస్యగా ఉంటుంది.ఆహారం, బట్టల కోసం పోరాడాల్సి వచ్చినప్పుడు ఆధ్యాత్మికతకు చోటు ఉండదు. ఇలా వస్తువుల మీద ప్రేమ ఉన్నవాళ్లే డబ్బు, పేరు కోసం ఆధ్యాత్మికతను అడ్డుపెట్టుకుంటారు.

సమంత : నేను సాధారణంగా ప్రశ్నలు అడిగేందుకు నోట్స్ క్యారీ చేయను. కానీ మిమ్మల్ని చూస్తే నా పేరు కూడా నేను మరచిపోతాను. అందుకే ఈ చీటీలు తెచ్చుకున్నా.( సామ్ ఫన్నీగా కామెంట్స్ చేసింది