Samala Kichidi : సామల కిచిడీ.. షుగర్ పేషంట్లకు బెస్ట్ బ్రేక్ ఫాస్ట్

సామల్లో ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం అధికంగా ఉంటాయి. హైబీపీ ఉన్నవారు తింటే బీపీ కంట్రోల్ లో ఉంటుంది. కీళ్లనొప్పులు, ఊబకాయం వంటి సమస్యలకు మంచిగా పనిచేస్తాయి.

  • Written By:
  • Publish Date - June 21, 2024 / 09:48 PM IST

Samala Kichidi Recipe : చిరుధాన్యాల్లో సామలు ఒక రకం. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా డయాబెటిక్ పేషంట్లకు మంచి ఆహారం. బరువు తగ్గాలనుకునేవారికి కూడా సూపర్ ఫుడ్. సామలను ఆహారంగా తీసుకుంటే కడుపునిండిన ఫీలింగ్ తో ఉంటారు కాబట్టి.. తక్కువ ఆహారాన్ని తీసుకుంటారు. సామలతో కిచిడి తింటే.. బ్లడ్ లో షుగర్ లెవల్స్ కూడా కంట్రోల్ లో ఉంటాయి.

సామల కిచిడీ రెసిపీకి కావలసిన పదార్థాలు

సామలు – 1 కప్పు

జీలకర్ర – 1 స్పూన్

పచ్చిమిర్చి – 2

ఉప్పు – రుచికి సరిపడా

నిమ్మరసం – 1 స్పూన్

క్యారెట్ ముక్కలు – 1/4 కప్పు

నూనె – కావలసినంత

బంగాళదుంపలు – 2

పల్లీలు – గుప్పెడు

నీరు – సరిపడా

కొత్తిమీర తరుగు – 2 స్పూన్లు

సామల కిచిడీ తయారీ విధానం

ముందుగా సామలను నీటిలో వేసి 5-6 గంటలు నానబెట్టాలి. ఆ నీటిని వడగట్టి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పై కళాయిపెట్టి నూనె వేయాలి. అది వేడెక్కాక జీలకర్ర వేసి, పల్లీలు, పచ్చిమిర్చి తరుగు వేసి.. వేయించుకోవాలి. ఇప్పుడు ఉడికించిన బంగాళదుంప ముక్కల్ని, క్యారెట్ ముక్కల్ని ఉప్పు వేసి బాగా కలుపుకుని ఉడకనివ్వాలి.

ఆ మిశ్రమంలో నానబెట్టిన సామలను వేసి 2 నిమిషాలు చిన్నమంటపై ఉడికించాలి. 2 కప్పుల నీటిని వేసి, 20 నిమిషాల పాటు ఉడికిస్తే కిచిడి దగ్గరగా ఉడుకుతుంది. పైన కొత్తిమీరను చల్లుకుంటే చాలు.. సామల కిచిడీ రెడీ. తినేముందు కాస్త నిమ్మరసం చల్లుకుంటే సూపర్ గా ఉంటుంది.

సామల్లో ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం అధికంగా ఉంటాయి. హైబీపీ ఉన్నవారు తింటే బీపీ కంట్రోల్ లో ఉంటుంది. కీళ్లనొప్పులు, ఊబకాయం వంటి సమస్యలకు మంచిగా పనిచేస్తాయి. పీసీఓడీ వంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.