Site icon HashtagU Telugu

Sajjala Khichdi: పిల్లలు ఎంతో ఇష్టపడే సజ్జల మసాలా కిచిడి..ట్రై చేయండిలా?

Mixcollage 18 Mar 2024 07 59 Pm 2772

Mixcollage 18 Mar 2024 07 59 Pm 2772

మామూలుగా మనం అనేక రకాల కిచిడీలు తయారు చేసుకొని తింటూ ఉంటాం. ముఖ్యంగా చిన్నపిల్లలు కిచిడీలు ఎక్కువగా తింటూ ఉంటారు. వీటిని తినడానికి ఎక్కువగా ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. అయితే ఎప్పుడైనా సజ్జలతో చేసిన మసాలా కిచిడి తిన్నారా. ఒకవేళ కిచిడి ఎప్పుడు తినకపోతే ఇంట్లోనే సింపుల్ గా ఎలా తయారు చేసుకోవాలో,అందుకు ఏ పదార్థాలు కావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కావాల్సిన పదార్థాలు :

సజ్జలు – ఒకటిన్నర కప్పు
బంగాళాదుంపలు – రెండు
ఉల్లిపాయ – ఒకటి
టమాటో – ఒకటి
పచ్చి మిర్చి – రెండు
నెయ్యి – రెండు స్పూన్లు
జీలకర్ర – ఒక స్పూను
ఉప్పు – తగినంత
లవంగాలు – రెండు
పసుపు – అర స్పూను
కారం – అర స్పూను
కరివేపాకులు – గుప్పెడు
బిర్యాని ఆకు – రెండు
ఇంగువ – చిటికెడు

తయారీ విధానం :

ఇందుకోసం సజ్జలు నీటిలో నానబెట్టి కాసేపు ఉడికించాలి. తరువాత నీళ్లు వంపేసి పక్కన పెట్టుకోవాలి. బంగాళాదుంపలను ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో నెయ్యి వేయాలి. నెయ్యి వేడెక్కాక ఇంగువ, లవంగాలు, జీలకర్ర, బిర్యానీ ఆకులు, లవంగాలు వేసి వేయించాలి. నిలువుగా ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకోవాలి. కారం, పసుపు కూడా వేయాలి. బంగాళాదుంపలను మెత్తగా నొక్కి వేసి కలపాలి. అన్నీ బాగా కలుపుకోవాలి. తర్వాత టమోటాలు వేసి మగ్గించాలి. ఉడికించిన సజ్జలను వేసి కలపాలి. ఉప్పు వేయాలి. నీరు వేసి మూత పెట్టి కాసేపు ఉడికించాలి. నీరు తగ్గితే కిచిడీ రెడీ.