Site icon HashtagU Telugu

Sago Idli : సగ్గుబియ్యం ఇడ్లీలు.. హెల్దీ బ్రేక్ ఫాస్ట్ !

sago idli

sago idli

Sago Idli : ఇడ్లీ అంటే ఎంత మందికి ఇష్టమో..ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ లో దానిని తినడానికి ఇష్టపడని వారు కూడా అంతేమంది ఉన్నారు. రొటీన్ గా మినప్పిండితో కాకుండా.. ఇలా సగ్గుబియ్యంతో ఇడ్లీలను తయారు చేసి తిని చూడండి. మళ్లీ మళ్లీ బ్రేక్ ఫాస్ట్ లో ఈ ఇడ్లీలనే తింటారు. ఇంట్లో ఏ బ్రేక్ ఫాస్ట్ తయారు చేయాలో తెలియనపుడు ఇన్ స్టంట్ గా సగ్గుబియ్యంతో మెత్తని ఇడ్లీలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

సగ్గుబియ్యం ఇడ్లీ తయారీకి కావలసిన పదార్థాలు

ఇడ్లీ రవ్వ – 1 కప్పు
సగ్గుబియ్యం – 1/2 కప్పు
పుల్లటి మజ్జిగ – 2 కప్పులు
నూనె – 1 టేబుల్ స్పూన్
ఆవాలు – 1/2 టీ స్పూన్
శనగపప్పు – 1 టీ స్పూన్
మినపప్పు – 1 టీ స్పూన్
తరిగిన కరివేపాకు – 1 రెమ్మ
రెడ్ చిల్లీ ఫ్లేక్స్ – 1 టీస్పూన్
ఉప్పు – తగినంత
వంటసోడా – 1/4 టీ స్పూన్

సగ్గుబియ్యం ఇడ్లీ తయారీ విధానం

ఒక గిన్నెలో ఇడ్లీ రవ్వను తీసుకుని.. అందులో సగ్గుబియ్యం వేసి కలపాలి. మజ్జిగ కూడా పోసి కలిపి దానిపై మూతపెట్టి గంటసమయం పాటు నానబెట్టాలి. ఇప్పుడు మరికొన్ని మజ్జిగను పోసి ఇడ్లీ పిండిలా గ్రైండ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని పక్కనపెట్టుకోవాలి.

ఒక కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. ఇందులో మినపప్పు, శనగపప్పు, ఆవాలు వేసి వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ తాలింపును ఇడ్లీపిండిలో వేసి కలుపుకోవాలి. తర్వాత కరివేపాకు వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేసుకుని.. దీనిని కూడా ఇడ్లీ పిండిలో వేసి, ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, వంటసోడా వేసి కలపాలి.

తర్వాత ఇడ్లీ ప్లేట్ లను తీసుకుని వాటికి నూనె రాసుకోవాలి. ఇప్పుడు పిండిని వేసుకుని ఇడ్లీ కుక్కర్ లో ఉంచి మూత పెట్టాలి. వీటిని 10 నిమిషాల పాటు మధ్యస్థ మంటపై 5 నిమిషాలపాటు చిన్న మంటపై ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొద్దిగా చల్లారిన తర్వాత.. ప్లేట్ లో వేసుకుని పల్లీ చట్నీ, గ్రీన్ చట్నీ, అల్లం చట్నీతో సర్వ్ చేసుకుని తింటే.. ఎంతో రుచిగా ఉంటాయి. ఇలా సగ్గుబియ్యంతో అప్పటికప్పుడు ఇన్ స్టంట్ ఇడ్లీని మీరుకూడా తయారు చేసి చూడండి.