మామూలుగా చాలామంది స్వీట్ తినడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అయితే స్వీట్ ఐటమ్స్ లో ఎప్పుడూ తినే ఐటమ్స్ మాత్రమే కాకుండా అప్పుడప్పుడు ఏవైనా కొత్త కొత్తగా తినాలని అనుకుంటూ ఉంటారు. అయితే ఎప్పుడైనా మీరు సగ్గుబియ్యం ఖీర్ తిన్నారా. మామూలుగా సగ్గుబియ్యాన్ని అనేక రకాల వంటల్లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. మరి ఈ సగ్గుబియ్యం కీర్ నీ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
సగ్గుబియ్యం ఖీర్ కి కావలసిన పదార్థాలు
సగ్గుబియ్యం – పావు కప్పు
నీళ్లు – అరకప్పు
పాలు – మూడు కప్పులు
చక్కెర – పావుకప్పు
బాదంపప్పులు – పది
కిస్ మిస్ – పది
యాలకుల పొడి – చిటికెడు
నెయ్యి – నాలుగు చెంచాలు
సగ్గుబియ్యం ఖీర్ తయారీ విధానం:
ఇందుకోసం ముందుగా చెంచాడు నేతిలో జీడిపప్పు, కిస్ మిస్ లను వేయించి పక్కన పెటు్టకోవాలి. సగ్గుబియ్యాన్ని అరగంట పాటు నీటిలో నానబెట్టాలి. తర్వాత ఆ నీళ్లు ఒంపేసి, మళ్లీ మంచినీళ్లు వేసి స్టౌ మీద పెట్టాలి. సగ్గుబియ్యం ట్రాన్స్ పరెంట్ గా అయ్యేవరకూ ఉడికించాలి. తర్వాత మంట సిమ్ లో పెట్టి పాలు పోయాలి. ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించాక చక్కెర, యాలకుల పొడి వేసి మూత పెట్టాలి. అడుగంటకుండా మధ్యమధ్యలో కలుపుతూ ఇరవై, ఇరవై అయిదు నిమిషాల పాటు ఉడికంచాలి. ఆపైన జీడిపప్పు, కిస్ మిస్ వేసి, నెయ్యి కూడా వేసి కలిపి దించేయాలి. అంతే సగ్గుబియ్యం ఖీర్ రెడీ.