మామూలుగా మనం స్నాక్స్ గా ఎన్నో రకాల వడలను తింటూ ఉంటాం. ఆకుకూర వడలు మిరపకాయ వడలు, బంగాళదుంప వడలు, అరటికాయ వడలు ఇలా చాలా రకాల వడలు తయారు చేసుకొని తింటూ ఉంటాం. ఎప్పుడైనా సగ్గుబియ్యం వడలను తిన్నారా. ఎప్పుడు తినకపోతే ఈ స్నాక్ ఐటెంను సింపుల్ గా ఇంట్లోనే టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
సగ్గు బియ్యం వడలు కావలసిన పదార్థాలు :
సగ్గుబియ్యం – ఒకటిన్నర కప్పు
బంగాళదుంపలు – రెండు
పంచదార – అర టీస్పూన్
పల్లీలు – ముప్పావు కప్పు
పచ్చిమిర్చి – మూడు
కొత్తిమీర- ఒక కట్ట
నిమ్మరసం – అర టేబుల్‌స్పూన్
ఉప్పు – రుచికి తగినంత
నూనె – డీప్ ఫ్రైకి సరిపడా
సగ్గుబియ్యం వడలు తయారీ విధానం:
ఇందుకోసం ముందుగా సగ్గుబియ్యాన్ని కడిగి పావు కప్పు నీళ్లు పోసి మూత పెట్టి రెండు గంటల పాటు పక్కన పెట్టుకోవాలి. బంగాళదుంపలను మెత్తగా ఉడికించుకుని పొట్టు తీసేసి ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. పల్లీలు వేయించి పొడి చేసుకోవాలి. ఇప్పుడు బంగాళదుంపల బౌల్‌లో సగ్గుబియ్యం, పల్లీల పొడి, పచ్చిమిర్చి, కొత్తిమీర, నిమ్మరసం, పంచదార, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ వడలుగా ఒత్తుకోవాలి. తరువాత కొద్దిసేపు వాటిని ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. స్టవ్‌పై కడాయి పెట్టి నూనె పోసి వేడి అయ్యాక వడలు వేసి వేయించాలి. అంతే ఎంతో స్పైసీగా ఉండే సగ్గుబియ్యం వడలు రెడీ.