E-Commerce: విపరీతంగా షాపింగ్ చేస్తున్నారా? ముందు ఈ విషయాలు తెలుసుకోండి!

టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో ప్రతి ఒక్కరూ అన్నీ ఇంటి నుండే ఆన్లైన్ ద్వారా షాపింగ్ చేయడం అలవాటు

  • Written By:
  • Updated On - September 1, 2022 / 10:38 AM IST

టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో ప్రతి ఒక్కరూ అన్నీ ఇంటి నుండే ఆన్లైన్ ద్వారా షాపింగ్ చేయడం అలవాటు నేర్చుకున్నారు. దీంతో ఈ మధ్యకాలంలో ఆన్లైన్ ద్వారా షాపింగ్ చేసే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. అయితే ఇటీవల కాలంలో ఈ ఆన్ లైన్ షాపింగ్ లలో కూడా మోసాలు జరుగుతున్నాయి. అయితే ఆన్లైన్ లో విపరీతంగా షాపింగ్ చేసేవారు విషయాలను తెలుసుకోవాలి. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ప్రముఖ నమ్మదగిన వెబ్ సైట్లలో మాత్రమే షాపింగ్ చేయాలి. అలాగే ఆఫర్స్ ఉన్నాయి అంటూ కనిపించే నకిలీ వెబ్సైట్స్ ల జోలికి వెళ్లొద్దు.

అదేవిధంగా ఈ కామర్స్ వెబ్సైట్ కు సంబంధించిన లాగిన్ వివరాలను ఎవరితో కూడా పంచుకోకూడదు. అలాగే మీ వ్యక్తిగత వివరాల్లో వెబ్ సైట్ కు అవసరమైన అనగా పేరు, చిరునామా, మొబైల్ నెంబర్, వంటివి తప్ప మరే ఇతర వివరాలను నమోదు చేయకూడదు. ఏదైనా ఒక వెబ్ సైట్ లో వస్తువును కొనుగోలు చేసే ముందు, ఇతర వెబ్ సైట్ లలో అలాగే బయట దుకాణాలలో వాటి ధర ఎంత ఉందో తెలుసుకోవాలి. ఆన్లైన్లో కొన్ని వస్తువులకు లేదా నిర్దేశించిన మొత్తం బిల్లుకు మాత్రమే ఉచిత డెలివరీ సదుపాయం ఉంటుంది.

లేదంటే వాటికి డెలివరీ చార్జీలు ఉన్నప్పుడు వాటిని పరిశీలించాలి. అలాగే ఆఫర్ల విషయంలో కూడా సరైన అవగాహన ఉండాలి. కొన్నిసార్లు వస్తువు ఉన్న ధరను పెంచి తగ్గించినట్లుగా చూపించి మోసం చేస్తుంటారు. అలాగే ఆన్లైన్లో ఆర్డర్ చేసిన కొన్ని వస్తువులకు మాత్రమే రిటర్న్ పాలసీ ఉంటుంది. కాబట్టి మీరు కొనుగోలు చేసే వస్తువుకి ఆ ఆప్షన్ ఉందో లేదో ముందే చెక్ చేసుకోవాలి. లేదంటే వస్తువు కొన్న తర్వాత నష్టపోవాల్సి ఉంటుంది. అదేవిధంగా డెబిట్,క్రెడిట్ కార్డుల ద్వారా లావాదేవీలు జరిపినప్పుడు వెంటనే వారికి సంబంధించిన లావాదేవీలను సరి చూసుకోవాలి.