Sabzi bahar: ఎంతో రుచికరమైన సబ్జీ బహార్.. ఇలా చేస్తే లొట్టలు వేసుకొని తినేయాల్సిందే?

ఎప్పుడూ ఒకే విధమైన వంటలు తిని తిని బోర్ కొడుతుందా? ఏదైనా సరికొత్తగా రిసిపి ట్రై చేయాలని అనుకుంటున్నారా. అయితే ఈ రెసిపీ మీ కోసమే. ఎంతో టేస్టీగ

Published By: HashtagU Telugu Desk
Mixcollage 01 Jan 2024 05 41 Pm 7446

Mixcollage 01 Jan 2024 05 41 Pm 7446

ఎప్పుడూ ఒకే విధమైన వంటలు తిని తిని బోర్ కొడుతుందా? ఏదైనా సరికొత్తగా రిసిపి ట్రై చేయాలని అనుకుంటున్నారా. అయితే ఈ రెసిపీ మీ కోసమే. ఎంతో టేస్టీగా రుచికరంగా ఉండే సబ్జీ బహార్ రెసిపీ ఇంట్లోనే సింపుల్ గా ఈ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

సబ్జీ బహార్ కు కావలసిన పదార్థాలు

పాలకూర – నాలుగు కట్టలు
క్యారట్ -మూడు
బీన్స్ – పావుకేజి
బాఠానీలు – ఒక కప్పు
వెన్న – చిన్న కప్పు
అల్లం, వెల్లుల్లి ముద్ద – ఒక స్పూను
ఉల్లిపాయలు – నాలుగు
టమాటాలు – ఐదు
జీడిపప్పు – కొద్దిగా
గసగసాలు – ఒక స్పూను
పెరుగు – రెండు స్పూన్లు
పచ్చిమిర్చి – నాలుగు
జీలకర్ర – ఒక స్పూను
కారం – సరిపడా
ఉప్పు – తగినంత

సబ్జీ బహార్ తయారీ విధానం:

ఇందుకోసం ముందుగా పాలకూరను చిన్నగా కట్ చేసుకొని నీటితో శుభ్రంగా కడగాలి. ఈ పాలకూరను వేడినీటిలో ఐదు నిమిషాలు ఉడికించాలి. తరువాత ఈ మిశ్రమాన్ని మిక్సీలో గ్రైండ్ చెయ్యాలి. ఇప్పుడు క్యారట్, బీన్స్ చిన్న ముక్కలుగా తరిగి, ఒక గిన్నెలో బాఠానీలు కలిపి ఉడికించాలి. అలాగే ఒక గిన్నెలో నూనె పోసి కాగిన తరువాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను ఎర్రగా వేయించాలి. అందులోనే అల్లం వెల్లుల్లి ముద్ద, కారం, జీడిపప్పు, గసగసాలు మెత్తగా నూరిన మసాలాను వేసి ప్రై చెయ్యాలి. ఆ పైన పెరుగు, టమాట జ్యూస్ వేసి, తగినంత ఉప్పు కలిపి గ్రేవీగా తయారు చెయ్యాలి. ఇప్పుడు ఒక పెనం మీద వెన్న వేసి దానిలో కొంచెం వేసి చిటపటలాడుతుండగా, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, పాలకూర గుజ్జు వేసి కలిపాలి. ఈ మిశ్రమాన్ని ఉడికిస్తూ ముందుగానే ఉడికించిన కూరలను కలపాలి. దానిలో తయారుచేసిన గ్రేవీని కూడా కలిపి కొంచెంసేపు ఉడికించి రైస్‌తో వడ్డించాలి. అంతే ఎంతో రుచికరమైన సబ్జీ బహార్ రెడీ.

  Last Updated: 01 Jan 2024, 05:41 PM IST