మాంసాహార ప్రియులు ఎక్కువగా చికెన్ మటన్ లేదా చేపల మాత్రమే తింటూ ఉంటారు. చాలా తక్కువ మంది మాత్రమే రొయ్యలను తింటూ ఉంటారు. రొయ్యలు కూడా మనకు మార్కెట్లో చాలా తక్కువగా ఉంటాయి. అయితే చాలామందికి రొయ్యలతో ఎటువంటి కూరలు చేయాలో తెలియక తికమకపడుతూ ఉంటారు. ఎక్కువగా రొయ్యల పులుసునే చేస్తూ ఉంటారు. అయితే ఎప్పుడైనా రొయ్యల ఇగురు ట్రై చేశారా. మరి ఈ వంటకాన్ని ఎలా ట్రై చేయాలో, అందుకు ఏఏ పదార్థాలో కావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
రొయ్యల ఇగురుజు కావలిసిన పదార్థాలు :
రొయ్యలు- అరకేజీ
ఉల్లిపాయలు – నాలుగు
అల్లంవెల్లుల్లి ముద్ద – రెండు స్పూన్లు
జీలకర్ర – 2 స్పూన్లు
కరివేపాకు – రెండు రెబ్బలు
టమాటాలు – మూడు
కొబ్బరి పాలు – ఒక కప్పు
పచ్చిమిర్చి – నాలుగు
కారం – తగినంత
ఉప్పు – తగినంత
పసుపు – తగినంత
నూనె – తగినంత
రొయ్యల ఇగురు తయారీ విధానం :
ఇందుకోసం ముందుగా రొయ్యలను శుభ్రం చేసి బాగా కడిగి కొంచెం ఉప్పు, పసుపు పట్టించి ఆరగంటసేపు నానబెట్టాలి. తరువాత ఒక బాణిలో నూనెపోసి వేడి అయ్యాక రొయ్యలను వేసి బాగా వేయించాలి. అలాగే వాటిలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి ముద్ద, కారం, తగినంత ఉప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు వెయ్యాలి. ఈ మిశ్రమంలో అరకప్పు నీళ్ళు పోసి కలిపి సన్నని మంటపై ఉడికించాలి. ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తరువాత, మరోసారి కలిపి జీలకర్ర, సన్నగా తరిగిన టమాట ముక్కలను వెయ్యాలి. గుజ్జుగా తయారైన తర్వాత కొబ్బరి పాలు వేసి కలియబెడితే చిక్కటి గ్రేవీ వస్తుంది. అంతే ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల ఇగురు తయారీ రెడీ.