Site icon HashtagU Telugu

Rice Vada: రైస్ వడ ఇలా చేస్తే చాలు.. ఒక్కటి కూడా మిగలదు?

Rice Vada

Rice Vada

మాములుగా మనం రకరకాల వడలు తయారు చేసుకొని తింటూ ఉంటాము. అలసంద వడ, మిరపకాయ బజ్జి, ఉర్లగడ్డ వడ, ఆకు కూర వడ అంటూ అనేక రకాల వడలు తినే ఉంటాము. అయితే ఎప్పుడు అయిన రైస్ వడ తిన్నారా. ఒకవేళ తినకపోతే ఈ రెసిపీని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం…

కావలసిన పదార్థాలు:

ఉడికించిన అన్నం – 2 కప్పులు
కొబ్బరి తురుము – 1 కప్పు
పెరుగు – 1 కప్పు
కారం పొడి – 1 స్పూన్
అల్లం పచ్చిమిర్చి పేస్టు – 2 స్పూన్స్
క్యాబేజీ తురుము – 1/4 కప్పు
క్యాప్సికం తురుము – 1/4 కప్పు
టమాటా ముక్కలు – 1/4 కప్పు
మైదాపిండి – 3 స్పూన్స్
కొత్తిమీర – సరిపడా
కరివేపాకు – సరిపడా
జీలకర్ర – సరిపడా
ఇంగువ – సరిపడా
ఉప్పు – సరిపడా
నూనె – 1/4 కేజీ

తయారీ విధానం:

ముందుగా ఒక వెడల్పాటి డిష్ లో పెరుగువేసి, అన్నము ఇంకా మిగిలిన పదార్థాలు ఒక్కొక్కటిగా వేసి, బాగా మెత్తగా కలిపి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి, బాణలి పెట్టి, నూనె వేసి, అన్నం మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని, వడల మాదిరిగా వేసి, ఎర్రగా రెండు వైపులా కాలిన తరవాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇష్టమైన వారు వారికి నచ్చిన చట్నీతో తినవచ్చును. అంతే కమ్మని రైస్ వడ రెడీ.